APCC Protest at Health University: మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఆందోళన
APCC Protest at Health University: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నీట్ మెడికల్ కౌన్సిలింగ్‌లో రిజర్వేషన్ విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్శిటీని ముట్టడించారు.
APCC Protest at Health University: రెండో విడత ఎంబిబిఎస్ మెడికల్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. యూనివర్శిటీ అధికారులను కలిసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు.
రెండో విడత మెడికల్ కౌన్సిలింగ్‌లో జరుగుతున్న అక్రమాలను వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ అధికారుల దృష్టి కి తీసుకెళ్లేదుకు ప్రయత్నించిన పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు నేతృత్వంలోని బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ యూనివర్సిటీ లోపలకు వెళ్లే క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట జరిగింది.
పీసీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలను పోలీసు లు అరెస్ట్ చేశారు. ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు యూనివర్సిటీ లోపలకు అనుమతించక పోవడంతో పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు యూనివర్సిటీ ప్రధాన గేట్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు.
ఏపీలో మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెరుగైన ర్యాంకులు సాధించిన ఎస్టీ, ఎస్టీ విద్యార్ధులకు జనరల్ క్యాటగిరీలో సీట్లు కేటాయించకుండా వారిని రిజర్వుడు స్థానాలకు పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు.
దీని వల్ల రిజర్వుడు అభ్యర్థులకు సీట్ల భర్తీలో అన్యాయం జరుగుతోందని, జనరల్ క్యాటగిరీలో ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేయాల్సి ఉన్నా, రిజర్వేషన్ క్యాటగిరీలో కేటాయించడం వల్ల సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రెండో విడత కౌన్సిలింగ్ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి 107, 108 జీవోల
హెల్త్ యూనివర్శిటీని పిసిసి నాయకుల ముట్టడి నేపథ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. వీసీ తమతో భేటీకి అవకాశం ఇచ్చినా పిసిసి బృందాన్ని కలవడానికి పోలీసులు అంగీకరించలేదని గిడుగు రుద్రరాజు ఆరోపించారు.