Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ కదం తొక్కిన ఉద్యోగులు
- Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు డైలీ వేజీ, పీస్ రేట్ పేర్లతో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యమించారు
- Contract Employees: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కదం తొక్కారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు డైలీ వేజీ, పీస్ రేట్ పేర్లతో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యమించారు
(1 / 7)
సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆందోళన జరిగాయి. పార్వతీపురంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు
(2 / 7)
కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టారు. భారీ ప్రదర్శనలు చేపట్టారు. తిరుపతి టౌన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వరదరాజనగర్ పెట్రోల్ బంక్ నుంచి టీటీడీ పరిపాలన భవనం వరకు భారీ పదర్శన నిర్వహించారు.
(3 / 7)
పార్వతీపురం మన్యం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాలు, సంస్థల్లోని పని చేసే కాంట్రాక్టు, టైంస్కేల్, కంటింజెంట్, పార్ట్‌టైమ్, గెస్ట్, పీస్‌రేట్, గౌరవవేతన తదితర నాన్ రెగ్యులర్ ఉద్యోగులు ఆందోళన చేపట్టి, జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
(4 / 7)
విజయవాడలో ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ధర్నాలో సిఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతపురంలో లలితా కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పు వాయిద్యాల నడుమా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి, డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు.
(5 / 7)
విజయనగరం టౌన్‌లో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ బెవారేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. నూతన మద్యం పాలసీ వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు.
(6 / 7)
విశాఖపట్నంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభతు్వం అతి తక్కవ వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయించుకుంటుందని విమర్శిచారు. ఇఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ, ఎరియర్స్, డీఏ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఏమీ వర్తించటం లేదని పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు