TG DSC : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్-tg dsc results released big alert to candidates verification starts on oct 1st ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG DSC : డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

Bandaru Satyaprasad HT Telugu
Sep 30, 2024 08:46 PM IST

TG DSC : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు.

 డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్, అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG DSC : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ 1 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 5 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ఫోన్ లో సమాచారం అందిస్తారు.

తుది జాబితాను డీఈవోలు ప్రకటిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల ఫొటో కాపీలతో వెరిఫికెషన్ హాజరవ్వాలని అధికారులు సూచించారు.

డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణ డిఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 3వరకు డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఫలితాల విడుదలలో జాప్యం జరగడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫలితాలను విడుదలయ్యాయి.

తెలంగాణ మెగా డిఎస్సీ 2024లో మొత్తం 11,062 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2629 ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6508, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 182, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 220, సెకండరీ గ్రేడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు 796పోస్టులు ఉన్నాయి. 2017 తర్వాత తెలంగాణలో డిఎస్సీ నియామకాలను 2024లోనే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 కేంద్రాల్లో డిఎస్సీ పరీక్షలను నిర్వహించారు.

రికార్డు సమయంలో ఫలితాలు విడుదల

తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

మరోవైపు డీఎస్సీ జనరల్ ర్యాకిం గ్ జాబితాలు విడుదల చేస్తే నియామక ప్రక్రియ ముందుకు వెళుతుంది. ఖాళీలను బట్టి 33 జిల్లాల్లో ద్రువపత్రాల పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితాను జిల్లా సెలక్షన్ కమిటీలకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి జాబితాలు వెళతాయి. ఈ మొత్తం ప్రక్రియకు మరో మూడు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.

టాపిక్