TG LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి
TG LAWCET 2024 Counselling : టీజీ లాసెట్ - 2024 కౌన్సెలింగ్ కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సెకండ్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ చేసుకోవచ్చు.
తెలంగాణ లాసెట్ 2024 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ రెండో విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి అయింది. వీరికి ఇవాళ సీట్లను అలాట్ చేస్తారు. లాసెట్ వెబ్ సైట్ ( https://lawcet.tsche.ac.in/ ) నుంచి అభ్యర్థులు అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
ఈ సెకండ్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 3 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. అక్టోబర్ 7వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
అలాట్ మెంట్ ఇలా చెక్ చేసుకోండి:
- లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Click here for TS LAWCET & PGLCET-2024 Admissions ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ LLB 3 YDC ఆప్షన్ పై నొక్కితే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- హోం పేజీలో కనిపించే Provisional Allotment Login Phase 2 పై నొక్కాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు ర్యాంకును ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ అలాట్ మెంట్ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందాలి.
తెలంగాణ లాసెట్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను సెప్టెంబరు 2న కేటాయించారు. కన్వీనర్ కోటా కింద 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లు 6,324 ఉన్నాయి. వీటి కోసం 14,817 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసి పోటీపడ్డారు. ఫస్ట్ ఫేోజ్ లో భాగంగా 3,901 మందికి మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లను కేటాయించారు. 1462 మందికి అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ సీట్లను అలాట్ చేశారు. ఇప్పటికే చాలా మంది కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారు.
ఇక ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.
టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు 2024:
- తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.
రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత మరో విడత కౌన్సెలింగ్ పై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా వర్శిటీనే ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మరోవైపు ఎల్ఎల్ ఎం కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా నడుస్తోంది.