BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు-dr br ambedkar open university application deadline extended till 15th october 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Braou Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు - మరోసారి దరఖాస్తుల గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 02, 2024 09:30 AM IST

BR Ambedkar Open University Admissions 2024: డిగ్రీ, పీజీ,డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియగా… తాజాగా మరోసారి అప్లికేషన్లు గడువు పొడిగించింది. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ దరఖాస్తుల గడువు పొడిగింపు
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ దరఖాస్తుల గడువు పొడిగింపు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుల గడువును కూడా పొడిగించారు. సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియగా… మరోసారి అధికారులు గడువును పెంచారు. అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ అప్లికేషన్లు చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

yearly horoscope entry point

కోర్సుల వివరాలు:

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్ లోకి వెళ్లి కోర్సుల కాంబినేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో MA, MSc, Mcom ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి. ఇక లైబ్రేరియన్ సైన్స్ తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.

ఎలా అప్లయ్ చేసుకోవాలంటే…

అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వెళ్లి ముందుగా అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.

  • డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Admissions for UG (BA/B.Sc/B.Com) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఉండే Registration Linkపై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొన్ని ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. ఇంటర్ విద్యను ఏ మోడ్ లో పూర్తి చేశారనేది. రెగ్యూలర్ లో చూస్తే రెగ్యూలర్ ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ లో చేస్తే సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • ముందుగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, చదవాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
  • సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
  • ఇక్కడ మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
  • ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
  • కోర్సు ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
  • చివరల్లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • ఆ తర్వాత అడ్మిషన్ ఖరారుకు సంబంధించి యూనివర్శిటీ నుంచి సమాచారం అందుతుంది. మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్ కు వెళ్లి మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీని అందజేయాల్సి ఉంటుంది.
  • పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేయాలి.
  • డిప్లోమా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు.

జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లు…!

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం వర్సిటీ హెల్ప్​లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600 సంప్రదించవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం