TS EAMCET Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై కీలక అప్డేట్, మే నెలాఖరులో రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్!-telangana eamcet 2023 results to be declared by may month end already keys released ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై కీలక అప్డేట్, మే నెలాఖరులో రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్!

TS EAMCET Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై కీలక అప్డేట్, మే నెలాఖరులో రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్!

Bandaru Satyaprasad HT Telugu
May 16, 2023 02:29 PM IST

TS EAMCET Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలపై కీలక అప్ డేట్ వచ్చింది. మే నెలాఖరులో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రైమరీ కీ విడుదల కావడంతో.. విద్యార్థుల అభ్యంతరాలు తెలుసుకుని తుది కీ విడుదల చేయనున్నారు.

ఎంసెట్ ఫలితాలు
ఎంసెట్ ఫలితాలు (HT)

TS EAMCET Results :తెలంగాణ ఎంసెట్(EAMCET 2023) పరీక్షలు ఇటీవలె ముగిసాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ప్రైమరీ 'కీ'లు కూడా విడుదల అయ్యాయి. అయితే ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలపై కీలక అప్ డేట్ వచ్చింది. మే నెలాఖరులోగా ఫలితాలు వెలువడతాయని సమాచారం. ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష కీ ను సోమవారం రాత్రి విడుదలల చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్‌లను eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే మే 15 రాత్రి 8 గంటల నుంచి మే 17 రాత్రి 8 గంటల వరకు తెలియజేయవచ్చు.

మే 26-30 మధ్య ఫలితాలు విడుదల

అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ టెస్ట్‌ల ప్రిలిమినరీ 'కీ'లపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. దీని తరువాత, తుది కీ రూపొందిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు పలు సెషన్ లలో నిర్వహించిన పరీక్షలు కాబట్టి ఫలితాల వెల్లడించడానికి కాస్త సమయం పడుతుంది. ఎంసెట్ ఫలితాలు మే 26 -30 తేదీల మధ్య ప్రకటించే అవకాశం ఉందని ఎంసెట్ నిర్వహణ వర్గాలు తెలిపాయి.

కర్నూలులో చీటింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థి

ఇదిలా ఉండగా, కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఇంజినీరింగ్ పరీక్షలో చిట్టిపై ఫార్ములాలు రాసుకుని ఎగ్జామ్ సెంటర్‌లోకి తీసుకెళ్లిన విద్యార్థి దానిని ఉపయోగించేందుకు ప్రయత్నించగా ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డాడు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష చివరి రోజున 95 శాతానికి పైగా హాజరు నమోదైంది. మొత్తం 33,854 మంది అభ్యర్థుల్లో ఆదివారం ఉదయం సెషన్‌లో 95.35 మంది పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా మొత్తం 33,722 మంది విద్యార్థుల్లో 95.36 శాతం మంది ఆదివారం మధ్యాహ్నం పరీక్షకు హాజరయ్యారు. మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ కేంద్రాలలో 3,20,683 మంది అభ్యర్థులు అంటే 94.11 శాతం మంది TS Eamcet 2023కి హాజరయ్యారు.

94.11 శాతం మంది హాజరు

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

IPL_Entry_Point