T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ కొట్టిన ఏకైక భారత ప్లేయర్ ఎవరో తెలుసా?
T20 World Cup news : టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ కొట్టిన ఏకైక భారత ప్లేయర్ ఎవరో తెలుసా? ఈ మెగా ఈవెంట్లో విరాట్ కోహ్లీ కొట్టిన మొత్తం రన్స్ ఎన్నో తెలుసా? ఇక్కడ చూసేయండి..
2024 T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్.. ఆదివారం ప్రారంభమవుతోంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌కి వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తుండటం ఇది రెండోసారి. యూఎస్ఏ కూడా వెస్టిండీస్‌తో కలిసి ఈసారి 2024 టీ20 వరల్డ్ కప్‌ని హోస్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటివరకు జరిగిన టీ20 ప్రపంచ కప్స్కు చెందిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 టీ20 వరల్డ్ కప్ స్టాట్స్..
2- వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లు చెరో రెండుసార్లు టీ20 వరల్డ్ కప్‌ని గెలుచుకున్నాయి. ఇదే హయ్యెస్ట్!
2012 ఎడిషన్‌లో శ్రీలంకపై, 2016లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ట్రోఫీని వెనకేసుకుంది వెస్టిండీస్. ఇక 2010లో ఆస్ట్రేలియాపై, 2022లో పాకిస్థాన్‌పై గెలిచి ట్రోఫీని ముద్దాడింది ఇంగ్లాండ్.
T20 World Cup Team India : 1- ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లు.. ఇప్పటివరకు ఒకసారి టీ20 వరల్డ్ కప్ గెలిచాయి. మేజర్ టీమ్స్‌లో సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ మాత్రమే ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచ కప్ గెలవలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. టాప్ 8 టీమ్స్‌లో ఉండే ఈ రెండు జట్లు 50 ఓవర్ వన్డే ప్రపంచ కప్‌ని ఒక్కసారి కూడా గెలవలేదు.
0- ఆతిథ్యం ఇచ్చిన జట్టు.. సొంతగడ్డపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు.. 2007లో సౌతాఫ్రికా నుంచి.. 2022లో ఆస్ట్రేలియా వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది.
అదే వన్డే ప్రపంచ కప్ విషయానికొస్తే.. 2011లో టోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన ఇండియా, 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లాండ్‌లు గెలిచాయి. 1996 ప్రపంచకప్ కో-హోస్ట్ శ్రీలంక.. లాహోర్‌లో కప్ గెలిచింది.
T20 World Cup latest news : 1141- టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో విరాట్ కోహ్లీకి హయ్యెస్ట్ యావరేజ్ ఉంది. ఐదు ఎడిషన్స్లోని 25 ఇన్నింగ్స్‌లలో 1141 రన్స్ చేశారు రన్ మెషిన్. యావరేజ్ 81.5, స్ట్రైక్ రేట్ 131.3. కింగ్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 14 హాఫ్ సెంచరీలు చేశాడు. మరే ఇతర ఆటగాడు కూడా ఇన్ని 50లు కొట్టలేదు.
2014, 2022 వరల్డ్ కప్ ఎడిషన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు కోహ్లీ. 2016లో సెకెండ్ హయ్యెస్ట్! 2014లో అయితే కోహ్లీ ఆట పీక్స్‌లో ఉండేది! 6 ఇన్నింగ్స్‌లలో 319 రన్స్ చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. 2016లో 273 రన్స్ చేశాడు. ఇదే ఏడాదిలో.. ఐపీఎల్లో కోహ్లీ 973 రన్స్ చేశాడు. ఇప్పటికీ ఇదొక రికార్డు.
6- టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆరుసార్లు సెమీ ఫైనల్స్‌లో ఆడింది. ఇదే హయ్యెస్ట్! 2007, 2022 ఫైనల్స్‌కి వెళ్లింది. 2009లో ఫైనల్స్ గెలిచింది. 2010, 2012, 2021లో సెమీస్‌కు వెళ్లింది.
T20 World Cup records : 11- 8 టీ20 ప్రపంచ కప్స్‌లో నమోదైన శతకాలు. 2009లో ఒక్క సెంచరీ కూడా నమోదవ్వలేదు! టీ20 ప్రపంచ కప్‌లో రెండుసార్లు 100 కొట్టిన ఏకైక బ్యాటర్ క్రిస్ గేల్. టీ20 ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన ఏకైక టీమిండియా ప్లేయర్ సురేశ్ రైన. 2010లో సౌతాఫ్రికాపై 60 బంతుల్లో 101 రన్స్ చేశాడు.
6- టీ20 వరల్డ్ కప్‌లో నమోదైన హ్యాట్రిక్స్! 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్‌ని తొలిసారి సాధించాడు ఆస్ట్రేలియన లెజెండ్ బ్రెట్‌లీ. 2009 నుంచి 2016 వరకు హ్యాట్రిక్‌లు నమోదవ్వలేదు. కానీ 2021- 2022లో 5 హ్యాట్రిక్‌లు నమోదవ్వడం విశేషం.
సంబంధిత కథనం