Love Me OTT: నెల‌లోపే ఓటీటీలోకి బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ - ల‌వ్ మీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-love me ott release date when and where to watch vaishnavi chaitanya horror love story ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Me Ott: నెల‌లోపే ఓటీటీలోకి బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ - ల‌వ్ మీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Love Me OTT: నెల‌లోపే ఓటీటీలోకి బేబీ హీరోయిన్ హార‌ర్ ల‌వ్ స్టోరీ - ల‌వ్ మీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 01, 2024 10:40 AM IST

Love Me OTT: ఆశీష్‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన హార‌ర్ ల‌వ్‌స్టోరీ ల‌వ్ మీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోపే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చెబుతోన్నారు.

ల‌వ్ మీ ఓటీటీ
ల‌వ్ మీ ఓటీటీ

Love Me OTT: ఆశీష్, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించిన ల‌వ్ మీ మూవీ మే 25న థియేట‌ర్ల‌లో రిలీజైంది. హార‌ర్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న‌ది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా పాయింట్‌ను ద‌ర్శ‌కుడు అర్థ‌వంతంగా తెర‌పై ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడ‌నే విమ‌ర్శ‌లొచ్చాయి. నెగెటివ్ టాక్ కార‌ణంగా ఆశించిన స్థాయిలో ల‌వ్ మీ విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

ఆహా ఓటీటీలో...

థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌లోనే ల‌వ్ మీ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ల‌వ్ మీ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

జూన్ 15 లేదా 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు చెబుతోన్నారు.

కీర‌వాణి మ్యూజిక్‌...

ల‌వ్ మీ మూవీతో అరుణ్ భీమ‌వ‌ర‌పు డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ప్రొడ్యూస్ చేశారు. ల‌వ్ మూవీ మూవీకి ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిచంగా...పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాడు.

ఇందులో ర‌వికృష్ణ‌, సిమ్రాన్ చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. దిల్ రాజు నిర్మాణంలో అగ్ర సాంకేతిక నిపుణుల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ చిన్న సినిమాను భారీగా ప్ర‌మోట్ చేశారు. టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. ప్ర‌చార చిత్రాల్లో ఉన్న కొత్త‌ద‌నం సినిమాలో మిస్స‌యింది.

ల‌వ్ మీ క‌థ ఇదే...

అర్జున్ (ఆశీష్‌) ఓ యూట్యూబ‌ర్. ద‌య్యాలు లేవ‌ని నిరూపించేలా వీడియోలు చేస్తూ వాటి ద్వారా డ‌బ్బులు సంపాదిస్తుంటాడు. ఓ రోజు తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోని ఓ ఊరిలో దివ్య‌వ‌తి అనే ద‌య్యం ఉంద‌ని, ఆమెను చూసిన వారు ఎవ‌రూ ప్రాణాల‌తో తిరిగి రాలేద‌నే విష‌యం అర్జున్‌కు తెలుస్తుంది.

దివ్య‌వ‌తిని వెతుక్కుంటూ అన్నయ్య ప్ర‌తాప్‌( ర‌వికృష్ణ‌)తో క‌లిసి ఆ ఊరికి వెళ‌తాడు అర్జున్‌. దివ్య‌వ‌తి గురించి అర్జున్ ఏం తెలుసుకున్నాడు? ద‌య్యాన్ని ప్రేమించాల‌ని అర్జున్ ఎందుకు అనుకున్నాడు? అత‌డి ప్రేమ క‌థ ఏమైంది? అర్జున్‌కు ప్రియ‌కు (వైష్ణ‌వి చైత‌న్య‌) ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ల‌వ్ మీ క‌థ‌.

బేబీ స‌క్సెస్ త‌ర్వాత‌...

బేబీ స‌క్సెస్ త‌ర్వాత వైష్ణ‌వి చైత‌న్య హీరోయిన్‌గా న‌టించిన మూవీ ఇది. ప్రియ‌గా డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ చేసింది. ఈ సినిమా కోసం సింగ‌ర్‌గా అవ‌తారం ఎత్తిన వైష్ణ‌వి చైత‌న్య ఓ పాట పాడింది. ప్ర‌స్తుతం తెలుగులో బేబీ త‌ర్వాత ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో మూవీ చేస్తోంది.

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న జాక్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది వైష్ణ‌వి చైత‌న్య‌. మ‌రోవైపు దిల్‌రాజు వార‌సుడిగా రౌడీ బాయ్స్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆశీష్‌. అత‌డు హీరోగా న‌టించిన సెకండ్ మూవీ ఇది. ప్ర‌స్తుతం హీరోగా సెల్ఫీష్‌తో పాటు మ‌రో మూవీ చేస్తోన్నాడు ఆశీష్‌.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్