IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ.. విజేతతోపాటు ఏ అవార్డుకు ఎంత దక్కిందంటే?-ipl 2024 prize money how much did kkr srh earn list of full award winners and their prize money ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ.. విజేతతోపాటు ఏ అవార్డుకు ఎంత దక్కిందంటే?

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ.. విజేతతోపాటు ఏ అవార్డుకు ఎంత దక్కిందంటే?

Hari Prasad S HT Telugu
May 27, 2024 04:15 PM IST

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎవరికి ఎంత దక్కింది? విజేత అయిన కేకేఆర్ తోపాటు రన్నరప్ సన్ రైజర్స్, ప్లేఆఫ్స్ చేరిన టీమ్స్, ఇతర అవార్డులు గెలిచిన వాళ్లకు ఎంత మొత్తం ఇచ్చారో చూడండి.

ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ.. విజేతతోపాటు ఏ అవార్డుకు ఎంత దక్కిందంటే?
ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ.. విజేతతోపాటు ఏ అవార్డుకు ఎంత దక్కిందంటే? (ANI)

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 రెండు నెలలకుపైగా క్రికెట్ అభిమానులను అలరించి ఆదివారం (మే 26) జరిగిన ఫైనల్ తో ముగిసింది. కేకేఆర్ మూడోసారి ట్రోఫీ గెలవగా.. సన్ రైజర్స్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. మరి ఈ మెగా లీగ్ లో విజేతతోపాటు ఎవరు ఎంత మొత్తం అందుకున్నారు? ఆరెంజ్ క్యాప్ గెలిచిన విరాట్ కోహ్లికి ఎంతిచ్చారు? ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ చూడండి.

ఐపీఎల్ 2024 ప్రైజ్‌మనీ ఇలా..

ఐపీఎల్ 2024లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కడం విశేషం. ఇక రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ కు కూడా రూ.13 కోట్లు దక్కాయి. మొత్తంగా ఐపీఎల్ 2024లో ప్రైజ్ మనీ రూపంలోనే రూ.46.5 కోట్లు ఖర్చు చేశారు. ఇది కేవలం విజేతలు, రన్నరప్స్ కే కాదు.. ప్లేఆఫ్స్ చేరిన టీమ్స్ అన్నింటికీ దక్కింది.

ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో రాయల్స్ టీమ్ కు రూ.7 కోట్లు దక్కాయి. ఇక అటు నాలుగో స్థానంలో నిలిచిన ఆర్సీబీకి రూ.6.5 కోట్లు ఇచ్చారు. టీమ్స్ కే కాదు ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్.. ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే.. ఇలా ఎన్నో అవార్డులను ఆయా ప్లేయర్స్, టీమ్స్ కు అందించడంతోపాటు వాటికి తగిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం విశేషం.

ఐపీఎల్ 2024లో ప్రైజ్ మనీ అందుకున్నది వీళ్లే..

ఆరెంజ్ క్యాప్ - విరాట్ కోహ్లి (741 రన్స్) - రూ.10 లక్షలు

పర్పుల్ క్యాప్ - హర్షల్ పటేల్ (24 వికెట్లు) - రూ.10 లక్షలు

మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ - సునీల్ నరైన్ - రూ.12 లక్షలు

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ - నితీష్ కుమార్ రెడ్డి - రూ.20 లక్షలు

అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ - సునీల్ నరైన్

అత్యధిక ఫోర్లు - ట్రావిస్ హెడ్ (64)

అత్యధిక సిక్స్‌లు - అభిషేక్ శర్మ (42)

స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ - జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (234.04 స్ట్రైక్ రేట్)

క్యాచ్ ఆఫ్ ద సీజన్ - రమణ్‌దీప్ సింగ్

ఫెయిర్ ప్లే అవార్డ్ - సన్ రైజర్స్ హైదరాబాద్

పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ - హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం)

గ్రౌండ్ సిబ్బందికి నజరానా

ఇవే కాకుండా ఐపీఎల్ 2024ను విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన గ్రౌండ్ సిబ్బందికి బీసీసీఐ ప్రత్యేక నగదు బహుమతి అందించింది. ఐపీఎల్లో రెగ్యులర్ పది వేదికలతోపాటు మరో మూడు వేదికల్లో ఈ సీజన్ మ్యాచ్ లు జరిగాయి.

వీటిలో రెగ్యులర్ గ్రౌండ్స్ అయిన హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మొహాలీల్లోని గ్రౌండ్లకు ఒక్కో దానికి రూ.25 లక్షలు ఇవ్వడం విశేషం. ఇక మిగిలిన మూడు గ్రౌండ్లు అయినా గౌమతి, ధర్మశాల, విశాఖపట్నంలలోని గ్రౌండ్లకు పదేసి లక్షలు ఇచ్చారు.

Whats_app_banner