తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ కోహ్లికే.. చాలా దూరంలోనే నిలిచిపోయిన ఇతర బ్యాటర్లు
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లికే దక్కింది. అతని తర్వాత ఉన్న బ్యాటర్లు చాలా దూరంలోనే నిలిచిపోయారు. టాప్ 5లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం.
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లికే దక్కింది. అతని తర్వాత ఉన్న బ్యాటర్లు చాలా దూరంలోనే నిలిచిపోయారు. టాప్ 5లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం.
(1 / 6)
IPL 2024 Orange Cap: ఆర్సీబీని ఫైనల్ చేర్చలేకపోయినా.. ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ మాత్రం విరాట్ కోహ్లికే దక్కింది. అతడు 15 మ్యాచ్ లలో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 741 రన్స్ చేశాడు. కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
(2 / 6)
IPL 2024 Orange Cap: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 14 మ్యాచ్ లలో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 583 రన్స్ చేశాడు.
(3 / 6)
IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 14 ఇన్నింగ్స్ లలో 4 హాఫ్ సెంచరీలతో 573 రన్స్ చేశాడు.
(4 / 6)
IPL 2024 Orange Cap: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడు 15 ఇన్నింగ్స్ లో 567 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టోర్నీ అంతా నిలకడగా ఆడిన అతడు.. ఫైనల్లో మాత్రం తొలి బంతికే డకౌటై టీమ్ కొంప ముంచాడు.
(5 / 6)
IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అత్యధిక పరుగుల వీరుల్లో ఐదో స్థానంలో నిలిచాడు. అతడు ఈ ఐపీఎల్ సీజన్ లో 15 ఇన్నింగ్స్ లో 531 రన్స్ చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు