Tollywood: ఫ్రైడే బాక్సాఫీస్ విన్నర్..విశ్వక్‌సేన్ మూవీ టాప్ - భజేవాయువేగం, గంగం గణేశాలకు కోటిలోపే కలెక్షన్స్
ఈ శుక్రవారం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు కార్తికేయ భజేవాయువేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ మూడు సినిమాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే?

ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోలు విశ్వక్‌సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గం గం గణేశాతో పాటు పాటు కార్తికేయ భజే వాయువేగం సినిమాలతో పోటీపడ్డారు. ఇందులో ఎవరు విన్నర్‌గా నిలిచారంటే...
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్స్ ఇవే...
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా దాదాపు నాలుగున్నర కోట్లకుపైగా గ్రాస్, రెండు కోట్ల ముప్పై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. విశ్వక్ సేన్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిలిచింది.
మాస్ ఆడియెన్స్‌లో ముఖ్యంగా బీసీ వర్గాలకు ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో ఫస్ట్ డే నైజాంతో పాటు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో చక్కటి కలెక్షన్స్ దక్కించుకొంది. నైజాంలో తొలిరోజు ఈ మూవీ కోటికిపైనే వసూళ్లను రాబట్టినట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
లంకల రత్న పాత్రలో...
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగవంశీతో కలిసి అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీని నిర్మించాడు. లంక గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో లంకల రత్న అనే యువకుడిగా విశ్వక్ సేన్ యాక్టింగ్, అతడి క్యారెక్టరైజేషన్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
కామెడీ ప్లస్….
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా మూవీ ఫస్ట్ డే ఎనభై నుంచి తొంభై లక్షల వరకు గ్రాస్, యాభై లక్షలకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించాడు.
ఓ విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడుఉదయ్ బొమ్మిశెట్టి ఈ మూవీని తెరకెక్కించాడు. కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. గం గం గణేశా మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌సారిక హీరోయిన్లుగా నటించారు. శనివారం ఈ మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.బేబీ సక్సెస్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఇది. బేబీ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
భజే వాయువేగం
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన భజేవాయువేగం కూడా తొలిరోజు యాభై లక్షల లోపే వసూళ్లను రాబట్టింది. తండ్రి ప్రాణాలను కాపాడుకునేందుకు బెట్టింగ్ మాఫియాతో ఓ యువకుడు ఎలా తలపడ్డాడనే పాయింట్ క్రైమ్ కామెడీ కథాంశంతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిన్న సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్, హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూడు సినిమాల భవితవ్యం ఏమిటన్నది శని, ఆదివారంనాటి కలెక్షన్స్‌తో తేలనుంది.