Russell Ananya Dance: లైగర్ బ్యూటీతో కలిసి డ్యాన్స్ చేసిన కేకేఆర్ స్టార్ క్రికెటర్.. షారుక్‌కు ఇష్టమైన పాటపై..-russel dances with ananya panday in kkr ipl winning party shah rukh khan song lutt putt gaya from dunki ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Russell Ananya Dance: లైగర్ బ్యూటీతో కలిసి డ్యాన్స్ చేసిన కేకేఆర్ స్టార్ క్రికెటర్.. షారుక్‌కు ఇష్టమైన పాటపై..

Russell Ananya Dance: లైగర్ బ్యూటీతో కలిసి డ్యాన్స్ చేసిన కేకేఆర్ స్టార్ క్రికెటర్.. షారుక్‌కు ఇష్టమైన పాటపై..

Hari Prasad S HT Telugu

Russell Ananya Dance: ఐపీఎల్ గెలిచిన తర్వాత కేకేఆర్ పార్టీలో స్టార్ క్రికెటర్ ఆండ్రీ రసెల్.. లైగర్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. అది కూడా షారుక్ కు ఇష్టమైన పాటపై కావడం విశేషం.

లైగర్ బ్యూటీతో కలిసి డ్యాన్స్ చేసిన కేకేఆర్ స్టార్ క్రికెటర్.. షారుక్‌కు ఇష్టమైన పాటపై.. (X Images)

Russell Ananya Dance: ఐపీఎల్ 2024 గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్, బాలీవుడ్ స్టార్లు రాత్రంతా పార్టీలో మునిగి తేలారు. ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఈ పార్టీలో స్టెప్పులేసింది. ఈ సందర్భంగా కేకేఆర్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఆమెతో డ్యాన్స్ చేయడం విశేషం.

రసెల్, అనన్య డ్యాన్స్

మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కేకేఆర్ టీమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ట్రోఫీ అందుకున్న తర్వాత చెపాక్ స్టేడియంలోనే అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకున్న టీమ్.. తర్వాత హోటల్లోనూ అదే మూడ్ ను కొనసాగించింది. టీమ్ ఓనర్ షారుక్ ఖాన్ కూడా ప్లేయర్స్ తో కలిసి పార్టీలో పాల్గొన్నాడు. ఇదే పార్టీలో లైగర్ మూవీలో విజయ్ సరసన నటించిన అనన్య పాండే కూడా ఉంది.

ఆమె షారుక్ కూతురు సుహానాతో కలిసి ఈ మ్యాచ్ చూడటానికి వచ్చింది. ఇక మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ తో కలిసి ఆమె కూడా పార్టీ చేసుకుంది. ఈ సందర్భంగా రసెల్, అనన్య చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. షారుక్ లేటెస్ట్ మూవీ డంకీ మూవీలోని లుట్ పుట్ గయా పాటకు ఈ ఇద్దరూ స్టెప్పులేశారు. రసెల్ కు ఎలా డ్యాన్స్ చేయాలో అనన్య చెబుతుండటం విశేషం.

కేకేఆర్ గెలుపులో రసెల్ పాత్ర

ప్రతిసారీ కేకేఆర్ కు తన విధ్వంసకర బ్యాటింగ్ తో విజయాలు సాధించి పెట్టే రసెల్.. ఈ సీజన్లో మాత్రం తన బౌలింగ్ తో ట్రోఫీ అందించాడు. ఈ సీజన్లో అతడు 222 రన్స్ చేయడంతోపాటు 19 వికెట్లు తీయడం విశేషం. సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్లోనూ అతడు 3 వికెట్లు తీశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఐపీఎల్ ఫైనల్స్ లో అతి తక్కువ స్కోరు (113) నమోదు చేసింది.

2012, 2014 తర్వాత మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత కేకేఆర్ టీమ్ మెంబర్స్ సంబరాలు ఆకాశాన్నంటాయి. మ్యాచ్ తర్వాత గ్రౌండ్లోనే టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాతో కలిసి రసెల్ డ్యాన్స్ చేయడం విశేషం. ఇక పార్టీలో అయితే మరింత రెచ్చిపోయాడు. మామూలుగానే వెస్టిండీస్ క్రికెటర్లు ఇలాంటి పార్టీలంటే చెలరేగిపోతారు.

"ఈ టీమ్ తో ఉంటే చాలు.. ఫీల్డ్ లో దిగి ఆడినా ఆడకపోయినా కానీ ప్లేయర్స్ కు మద్దతు ఇవ్వడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఇది మరింత ప్రత్యేకమైన అనుభూతి. తుది జట్టులో ఉండి ఫైనల్ ఆడి విజయంలో నా వంతు పాత్ర పోషించాను. ఇది చాలా అద్భుతమైన అనుభూతి" అని ఫైనల్లో గెలిచిన తర్వాత రసెల్ అన్నాడు.

మరోవైపు బాలీవుడ్ నటి అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లోనే బిజీ అయిపోయింది. అనన్య ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు.