AP TG Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఏపీలోని ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు-ap telangana is likely to receive rain again from today imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఏపీలోని ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు

AP TG Weather Updates : తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు - ఏపీలోని ఈ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు

Jun 01, 2024, 07:27 AM IST Maheshwaram Mahendra Chary
Jun 01, 2024, 07:27 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండగా…. మరోవైపు ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అంతేకాకుండా పలు జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఓవైపు భానుడి భగభగలు పెరుగుతుండగా… మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. 

(1 / 7)

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఓవైపు భానుడి భగభగలు పెరుగుతుండగా… మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. (@APSDMA Twitter)

ఇవాళ(జూన్ 1) ఏపీలోని విజయనగరం6, మన్యం 9 మండలంలో తీవ్రవడగాల్పులు, 43 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నుంచి 3రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

(2 / 7)

ఇవాళ(జూన్ 1) ఏపీలోని విజయనగరం6, మన్యం 9 మండలంలో తీవ్రవడగాల్పులు, 43 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నుంచి 3రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.(@APSDMA Twitter)

శుక్రవారం(మే 31) పల్నాడు(D) వినుకొండలో 45.9°C,ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4°C, ఎన్టీఆర్(D)నందిగామలో 45.3°C, గుంటూరు(D) తుళ్ళూరు, ఫిరంగిపురంలో 45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు,

(3 / 7)

శుక్రవారం(మే 31) పల్నాడు(D) వినుకొండలో 45.9°C,ప్రకాశం(D) పుల్లలచెరువులో 45.4°C, ఎన్టీఆర్(D)నందిగామలో 45.3°C, గుంటూరు(D) తుళ్ళూరు, ఫిరంగిపురంలో 45°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని సూచించారు,(@APSDMA Twitter)

ఇక తెలంగాణలో చూస్తే…. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 

(4 / 7)

ఇక తెలంగాణలో చూస్తే…. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. (@APSDMA Twitter)

 జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణలోని  పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి

(5 / 7)

 జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణలోని  పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి(@APSDMA Twitter)

తెలంగాణ ప్రాంతంలో జూన్ 6వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం అత్యధికంగా భీమారం(మంచిర్యాల జిల్లా), కమాన్‌పూర్‌(పెద్దపల్లి)లలో 47.1, గరిమెళ్లపాడు(భద్రాద్రి)లో 46.9, కేతెపల్లి(నల్గొండ)లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

(6 / 7)

తెలంగాణ ప్రాంతంలో జూన్ 6వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం అత్యధికంగా భీమారం(మంచిర్యాల జిల్లా), కమాన్‌పూర్‌(పెద్దపల్లి)లలో 47.1, గరిమెళ్లపాడు(భద్రాద్రి)లో 46.9, కేతెపల్లి(నల్గొండ)లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జూన్ మొదటి వారంలోనే నైరుతు రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(7 / 7)

జూన్ మొదటి వారంలోనే నైరుతు రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణలోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది.(@APSDMA Twitter)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు