Movies on Women Athletes: మహిళా అథ్లెట్లపై వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. మీరు ఎన్ని చూశారు?
- Movies on Women Athletes: జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ రిలీజ్ కు ముందు కచ్చితంగా చూడాల్సిన మహిళా అథ్లెట్ల సినిమాలు ఇవి. అవేంటో చూడండి.
- Movies on Women Athletes: జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ రిలీజ్ కు ముందు కచ్చితంగా చూడాల్సిన మహిళా అథ్లెట్ల సినిమాలు ఇవి. అవేంటో చూడండి.
(1 / 8)
Movies on Women Athletes: జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ ఆసక్తి రేపుతోంది. శరణ్ శర్మ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఇండియన్ వుమెన్ అథ్లెట్లపై వచ్చిన సినిమాలేవో చూడండి.
(2 / 8)
Movies on Women Athletes: బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ సైనా మూవీలో పరిణీతి చోప్రా లీడ్ రోల్లో నటించింది. సైనా జీవితాన్ని కళ్లకు కట్టిన మూవీ ఇది.
(3 / 8)
Movies on Women Athletes: రెజ్లర్ గీతా ఫోగాట్ పై రూపొందిన సినిమా దంగల్. ఈ మూవీలో ఆమె పాత్రలో ఫాతిమా సనా షేక్ నటించగా.. ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్ పాత్రలో ఆమిర్ ఖాన్ నటించాడు. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది.
(4 / 8)
Movies on Women Athletes: మాధవన్ ఓ బాక్సింగ్ కోచ్ గా నటించిన మూవీ సాలా ఖడూస్. తమిళంలో ఇరుది సుట్రు మూవీకి రీమేక్ ఇది. మాధవన్ తోపాటు రితికా సింగ్ నటించిన ఈ మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
(5 / 8)
Movies on Women Athletes: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ శభాష్ మిథు మూవీలో తాప్సీ పన్ను లీడ్ రోల్లో నటించింది.
(6 / 8)
Movies on Women Athletes: పంగా మూవీలో మాజీ కబడ్డీ ఛాంపియన్ గా కంగనా రనౌత్ నటించింది. అశ్విని అయ్యర్ తివారీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆటను వదిలేసి వెళ్లిన తర్వాత చాలా రోజులకు మళ్లీ గేమ్ లో అడుగు పెట్టి, వయసుతో పోటీ పడి గెలిచిన ప్లేయర్ పాత్రలో కంగనా అదరగొట్టింది.
(7 / 8)
Movies on Women Athletes: బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ బయోపిక్ లో ఆమె పాత్రలో ప్రియాంకా చోప్రా నటించింది. ఈ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇతర గ్యాలరీలు