Harom Hara: ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదు: హీరో సుధీర్ బాబు-sudheer babu comments on harom hara in trailer release event mahesh babu about harom hara trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harom Hara: ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదు: హీరో సుధీర్ బాబు

Harom Hara: ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదు: హీరో సుధీర్ బాబు

Sanjiv Kumar HT Telugu
Jun 01, 2024 11:14 AM IST

Sudheer Babu About Harom Hara Movie: హీరో సుధీర్ బాబు నటించిన మరో యూనిక్ మూవీ హరోం హర. ఈ మూవీ ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. హరోం హర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఇండియన్ సినిమాలోనే ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో మూవీ రాలేదని సుధీర్ బాబు కామెంట్స్ చేశాడు.

ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదు: హీరో సుధీర్ బాబు
ఇండియన్ సినిమాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ మూవీ రాలేదు: హీరో సుధీర్ బాబు

Sudheer Babu About Harom Hara Movie: విభిన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటున్నాడు హీరో సుధీర్ బాబు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా సుధీర్ బాబు హీరోగా వస్తున్న కొత్త సినిమా హరోం హర. ఈ సినిమాతో మరొక కొత్త ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్ బాబు.

ఎస్‌ఎస్‌సీ (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన మేకర్స్, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ని లాంచ్ చేశారు.

ట్రైలర్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మాట్లాడారు. "హరోం హర స్క్రీన్‌పైకి ఏం తీసుకువస్తుందో చూడాలని ఎదురు చూస్తున్నాను! ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది! సుధీర్‌బాబు అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు" అని మహేష్ బాబు తెలిపారు. ఈ లాంచ్ ఈవెంట్‌కు బ్లాక్ బస్టర్స్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

"కృష్ణగారి జయంతి సందర్భంగా ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా స్పెషల్. యాక్షన్ సినిమా చేయమని కృష్ణ గారు చాలా సార్లు చెబుతుండేవారు. ఈ సినిమా విషయంలో ఆయన చాలా ఆనందపడతారని నమ్ముతున్నాను. ఈ వేడుకు వచ్చి మాకు సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి గారికి, సంపత్ నంది గారికి, దాముగారికి, వేణు గోపాల్ గారికి, పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు" అని సుధీర్ బాబు తెలిపారు.

"తెలుగు, ఇండియన్ సినిమాలో హరోం హర లాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా రాలేదని అనుకుంటున్నాను. ఇందులో సుబ్రహ్మణ్యం గన్ స్మిత్. ఇలాంటి క్యారెక్టర్‌తో ఏ సినిమా రాలేదు. క్యారెక్టర్ పెరిగేకొద్ది రకరకాల గన్స్, ల్యాండ్ మైన్స్, రాకెట్ లాంచర్స్.. ఇలా చాలా చాలా తయారు చేస్తాడు. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం. లేదా రాంబో ఇన్ కుప్పం అనొచ్చు" అని హీరో సుధీర్ బాబు పేర్కొన్నారు.

"మన పక్కింటి కుర్రాడికి గన్ తయారుచేసే నాలెడ్జ్ ఉంటే అతను ఎలా తయారు చేస్తాడనే తరహలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మ్యూజిక్, డైలాగ్స్‌కి మ్యాచ్ అయ్యేలానే వెపన్స్ ఉంటాయి. గన్స్ కోసం సాగర్ టీం చాలా లోతుగా పరిశోధించారు. గన్ మేకింగ్‌ని చాలా సహజసిద్ధంగా ఇందులో చూపించాం. మేకింగ్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నాం" అని సుధీర్ బాబు వెల్లడించారు.

"యాక్షన్ సీక్వెన్స్‌ టాప్ క్లాస్‌లో ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్స్‌లో రెండు వేల మంది సెట్స్‌లో ఉంటారు. కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా చేశాం. నిర్మాతలు సినిమాని చాలా గ్రాండ్‌గా నిర్మించారు. సాగర్ సినిమా కోసం ప్రత్యేకమైన వరల్డ్‌ని క్రియేట్ చేశాడు. ఇది న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. చేతన్ చాలా అద్భుతమైన మ్యూజిక్ చేశాడు. టీం అంతా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు" అని సుధీర్ బాబు అన్నారు.

"సమ్మోహనం విడుదల డేట్‌కి ఈ హరోం హర సినిమా విడుదల అవుతుంది. తప్పకుండా సినిమా యునానిమస్‌గా హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది థియేట్రికల్ ఫిల్మ్. జూన్ 14న అందరూ తప్పకుండా థియేటర్స్‌లోనే చూడండి" అని హీరో సుధీర్ బాబు కోరారు.

టీ20 వరల్డ్ కప్ 2024