Flop Movies: 100 డేస్ ఆడి కూడా ప్లాప్ అయిన సినిమాలు.. మహేష్ బాబువే ఎక్కువ!
Flop Movies At Box Office With 100 Days Screening: సాధారణంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద 100 డేస్ ఆడి సత్తా చాటుతుంటాయి. కానీ, అనూహ్యంగా కొన్ని ప్లాప్ సినిమాలు సైతం 100 రోజులు ప్రదర్శించబడ్డాయి. మరి ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
Flop Movies With 100 Days At Box Office: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్, హిట్ టాక్, మంచి టాక్ వేరు వేరుగా ఉంటుంది. ఏ సినిమాకు ఎలాంటి టాక్, వసూళ్లు వస్తాయో చెప్పలేం. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ సినిమాలు మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంటే మంచి మూవీస్ సైతం సరైన ఆదరణ లేక చతికిలపడిపోతుంటాయి. ప్రేక్షకులకు అర్థం కాకపోడవంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సైతం ప్లాప్ చేసిన దాఖలాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, సాధారణంగా హిట్ టాక్ అందుకున్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద 100 డేస్ అడి సత్తా చాటుతుంటాయి. కానీ, కొన్ని ప్లాప్ సినిమాలు సైతం 100 రోజులు ఆడటం విశేషం. మరి ఆ సినిమాలు ఏంటీ? వాటిలో ఏ హీరో మూవీస్ ఎక్కువగా ఉన్నాయో లుక్కేద్దాం.
మున్నా
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన రివేంజ్ కమర్షియల్ మూవీ మున్నా. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. 2007 మే 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. కానీ, ఇందులో ప్రభాస్ లుక్స్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. అలాంటి ఈ సినిమా ఏకంగా 9 కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. హిట్ టాక్‌తో సంబంధం లేకుండా ప్రభాస్ క్రేజ్‌తో మున్నా అన్ని సెంటర్లలో 100 రోజులు ఆడటం విశేషం.
స్పైడర్ మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన సినిమా స్పైడర్. 2017 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా కమర్శియల్‌గా హిట్ కానప్పటికీ నెల్లూరు లోని రామరాజు థియేటర్‌లో 100 రోజులు ఆడింది. ఫస్ట్ లుక్ వీడియోతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందులేకపోయింది. ఇందులో హీరోయిన్‌గా ఫిట్ నెస్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. మహేష్ బాబు-మురుగదాస్-రకుల్ ఈ ముగ్గురు తొలిసారిగా స్పైడర్ సినిమాతో కలవడం విశేషం.
అంజి సినిమా
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ కెరీర్‌లో చాలా ఏళ్లుగా తెరకెక్కించిన సినిమా అంజి. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాభావాన్ని ఎదుర్కొంది. కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా 2004 జనవరి 15న విడుదలై ప్లాప్ తెచ్చుకుంది. అయినప్పటికీ కొన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది.
రూ. 25 నుంచి 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ అంజి సినిమాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హీరోయిన్‌గా నటించడం విశేషం.
ఖలేజా
మహేష్ బాబు-త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఖలేజా. ఫుల్ లెంత్ కామెడీ అండ్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్లాప్ చేశారు. కానీ, టీవీల్లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అలాంటి ఈ ఖలేజా (Khaleja Movie) సినిమా చిత్తూరులోని శ్రీనివాస థియేటర్‌లో వంద రోజులు అడింది. ఇలా వీటిలో చూస్తే మహేష్ బాబు నటించిన స్పైడర్, ఖలేజా రెండు సినిమాలతో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.