Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర-sudheer babu harom hara released on super star krishna birthday may 31 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

Harom Hara Release: మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

Sanjiv Kumar HT Telugu
Apr 28, 2024 01:52 PM IST

Harom Hara Release On Super Star Krishna Birthday: సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన అల్లుడు సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ హరోం హరను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఇటీవల ప్రకటించారు.

మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర
మామ సూపర్ స్టార్ కృష్ణ జయంతికి అల్లుడి సినిమా రిలీజ్.. ఆరోజున సుధీర్ బాబు హరోం హర

Sudheer Babu Harom Hara: యంగ్ హీరో సుధీర్‌ బాబుకు తన మామగారు సూపర్‌ స్టార్ కృష్ణ అంటే చాలా గౌరవం అని తెలిసిందే. కృష్ణ పుట్టిన రోజు నాడు తన సినిమాల కంటెంట్ ఏదైనా విడుదల చేస్తుంటారు. ఈ సారి తన అప్ కమింగ్ మూవీ 'హరోం హర' చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ అనౌన్స్ చేశారు. ఇది పర్ఫెక్ట్ డేట్ అని తెలుస్తోంది.

వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. ఈ సమయంలో పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవైపు సూపర్ స్టార్ కృష్ణ జయంతి, మరోవైపు హాలీడేస్ కారణంగా మే 31 మంచి రిలీజ్ డేట్ కానుందని మూవీ యూనిట్ భావించినట్లు తెలుస్తోంది.

ఈ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ హరోరం హర మూవీ టీమ్ ఒక పోస్టర్ విడుదల చేసింది. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది. అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. సూపర్ బాబు ఫెరోషియస్‌గా కనిపిస్తున్న పోస్టర్ అదిరిపోయింది.

ఈ పోస్టర్‌పై హరోం హర మే 31న వరల్డ్ వైడ్‌ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అని రాసి ఉంది. ఇకపోతే ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా మాళవిక శర్మ కథానాయికగా చేస్తోంది. అలాగే సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

హరోం హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం కంప్లీట్‌గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఇప్పటికే హరోం హర టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మొదటి పాట ఇంటెన్స్‌గా ఉండగా, ఇటీవల విడుదలైన సెకండ్ సింగిల్ సోల్‌ఫుల్ మెలోడీగా ఉంది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే, హిట్స్ ప్లాప్స్ అని తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు సుధీర్ బాబు. గతేదాడి మామా మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఈ హీరో. ఇందులో మూడు డిఫరెంట్ రోల్స్‌లో త్రిపాత్రాభినయం చేసి అలరించాడు సుధీర్ బాబు. ఈ సినిమాకు నటుడు హర్ష వర్ధన్ దర్శకత్వం వహించారు.

ఏ మాయ చేశావే సినిమాలో గెస్ట్ అప్పిరీయన్స్ ఇచ్చిన సుధీర్ బాబు శివ మనసులో శృతి (ఎస్ఎమ్‌ఎస్) సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ప్రేమకథా చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. అనేకరకమైన ప్రయోగాత్మక చిత్రాలు చేసిన సుధీర్ బాబు హిందీలో భాగీ సినిమాతో విలన్‌గా సైతం ఆకట్టుకున్నాడు.

IPL_Entry_Point