Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్-thrigun lineman movie ott streaming now on kannada local ott adith arun lineman ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lineman Ott: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Lineman OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Sanjiv Kumar HT Telugu
Apr 28, 2024 08:47 AM IST

Lineman Movie OTT Streaming Now: సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిత్ అరుణ్ హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే కన్నడలో కూడా డెబ్యూ ఇస్తూ చేసిన సినిమా లైన్ మ్యాన్. తాజాగా ఈ లైన్ మ్యాన్ సినిమా ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసింది.

ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన కామెడీ మూవీ.. అక్కడ స్ట్రీమింగ్.. కానీ, చిన్న ట్విస్ట్

Trigun Lineman OTT Release: ఈ మధ్య ఓటీటీల్లోకి కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఊడిపడుతున్నాయి. కొన్నింటి థియేట్రికల్ రిలీజ్ తెలియకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే మరికొన్ని థియేటర్లలో పెద్దగా ఆదరణకు నోచుకోని సినిమాలకు కూడా ఓటీటీలే దిక్కుగా మారుతున్నాయి. దాంతో సడెన్‌గా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీల్లోకి వదులుతున్నారు మేకర్స్.

పేరు మార్చుకుని హీరోగా మారి

అయితే, కొన్ని సినిమాలు పాపులర్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంటే.. మరికొన్ని ఎవరికీ తెలియను డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటున్నాయి. అలా తాజాగా ఎవరికీ తెలియని ఓ ఓటీటీలోకి వచ్చింది తెలుగు కామెడీ సినిమా. ఆ మూవీ పేరే లైన్ మ్యాన్. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అదిత్ అరుణ్ అనంతరం హీరోగా మారాడు. త్రిగుణ్‌గా పేరు మార్చుకుని హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

కన్నడలో డెబ్యూ

చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, ప్రేమదేశం, 24 కిస్సెస్ వంటి తదితర సినిమాలతో హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు త్రిగుణ్. వాటిలో పెద్దగా హిట్స్ లేకపోవడం వల్ల హీరోగా క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ఇక ఇటీవల కన్నడలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లైన్ మ్యాన్ మూవీతో కన్నడలో డెబ్యూ ఇచ్చాడు. మార్చి 22న లైన్ మ్యాన్ మూవీ ఇటు తెలుగు, అటు కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదలైంది.

లోకల్ కన్నడ ఓటీటీ

బాక్సాఫీస్ బరిలోకి దిగిన లైన్ మ్యాన్ సినిమా పెద్దగా ప్రజాదరణ పొందలేదు. ఇప్పుడు నెలరోజులకు చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది ఈ లైన్ మ్యాన్ మూవీ. కానీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5, జియో సినిమా, ఈటీవీ విన్ ఇంకా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన తదితర ఓటీటీల్లో విడుదల కాలేదు. కేవలం లోకల్ కన్నడ ఓటీటీలోనే లైన్ మ్యాన్ మూవీ డిజిటల్‌గా ప్రసారం అవుతోంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ లోకల్ కన్నడ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లైన్ మ్యాన్ సినిమా కన్నడ భాషలోనే కాకుండా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోందని సమాచారం. దీంతో తెలుగు ఓటీటీలోకి రాని తెలుగు సినిమాగా లైన్ మ్యాన్ ఒకరకమైన గుర్తింపు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఓటీటీల్లోకి లైన్ మ్యాన్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

నటీనటులు

కాగా, ఈ లైన్ మ్యాన్ చిత్రంలో త్రిగుణ్‌తోపాటు కాజల్ కుందెర్, బి. జయశ్రీ, నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్, సుజయ్ శాస్త్రి, అపూర్వ శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ప్రచూర. పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలుగా వ్యవహరించారు. 

ఈ సినిమాకు వి రఘుశాస్త్రి దర్శకత్వం వహించారు. శాంతి సాగర్ హెచ్.జి సినిమాటోగ్రఫీ అందించగా.. రఘునాథ ఎడిటింగ్ బాధ్యతలు, కాద్రి మణికాంత్ సంగీతం అందించారు.

ఇదీ కథ

మాండ్య ప్రాంతంలోని సమీప గ్రామంలో దేవుడమ్మ వెయ్యికి పైగా కాన్పులు చేసి ఉంటుంది. దాంతో ఆమె 100వ పుట్టినరోజును ఘనంగా జరిపేందుకు గ్రామస్థులు రెడీ అవుతారు. అందులో భాగంగానే గ్రామంలోని వారంత కరెంట్ లేకుండా నాలుగు రోజులు ఉండటానికి నిర్ణయించుకుంటారు. వాళ్లు అలా నిర్ణయించుకోడానికి గల కారణాలు, హీరో ప్రేమాయణం, అతన్ని అందరూ నట్టు అని పిలవడం వంటి ఆసక్తి అంశాలతో సినిమాగా సాగుతుంది.

IPL_Entry_Point