Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్
V Samudra Ravi Varma Bullet 50 Days Event: హీరోగా తెలుకు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రవి వర్మ సినిమా బుల్లెట్. ఈ మూవీ ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాపులర్ డైరెక్టర్ వి సముద్ర ప్రభాస్, గోపీచంద్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Prabhas Gopichand Ravi Varma: శ్రీ బండి సదానంద్ అండ్ మెమరీ మేకర్స్ సోమిసెట్టి హరికృష్ణ సమర్పణలో తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం బుల్లెట్. ఎవ్వడికైనా దిగుద్ది అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు దర్శకుడు చౌడప్ప డైరెక్షన్ చేశారు.
ఈ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు రవి వర్మ. బుల్లెట్ సినిమాలో రవి వర్మకు జోడీగా హీరోయిన్ సంజనా సింగ్ నటించింది. ఈ ఇద్దరితోపాటు ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, షఫీ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా ఇంకా థియేటర్లలో కొనసాగుతుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం (ఏప్రిల్ 26) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బుల్లెట్ 50 రోజుల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శోభారాణి, దర్శకులు వి సముద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
"చిన్న చిత్రాలు రెండు మూడు రోజులు కూడా ఆడని ఈ రోజుల్లో బుల్లెట్ 50 రోజులు పూర్తి చేసుకొని ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడం మామూలు విషయం కాదు. బుల్లెట్ ఇప్పుడు చిన్న సినిమా కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు చౌడప్ప గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన డైరెక్టర్‌గా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్" అని శోభారాణి చెప్పారు.
ఇక బుల్లెట్ 50 డేస్ ఫంక్షన్‌లో హీరో రవివర్మ మాట్లాడుతూ.."మా సినిమాని ఇంతలా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన మొదటి చిత్రమే 50 రోజులు పూర్తి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు.
"ఈ సినిమా విజయంపై మొదటి నుంచి నమ్మకంగా ఉన్నాం. అనుకున్నట్టుగా విజయం సాధించడంతో పాటు 50 రోజులు వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు చౌడప్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్న" అని నిర్మాత గోపాల్ అన్నారు.
"మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా చిత్రానికి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని డైరెక్టర్ చౌడప్ప తెలిపారు. ఇంకా ఈ సినిమాలో సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా, వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.