Shaitaan OTT Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!-shaitaan ott release date ajay devgan and jyothika horror movie will stream on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaitaan Ott Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!

Shaitaan OTT Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!

Shaitaan OTT Release Date: సైతాన్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ హారర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే..

Shaitaan OTT Release Date: రూ.200 కోట్ల కలెక్షన్ల హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఆరోజునే!

Shaitaan OTT: బాలీవుడ్ మూవీ ‘సైతాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయింది. సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రానికి భారీ వసూళ్లు దక్కాయి. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో క్రమంగా దుమ్మురేపింది. ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్లకు పైగా సైతాన్ చిత్రం దక్కించుకుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‍గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ సైతాన్ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

స్ట్రీమింగ్ అప్పుడే!

సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 3వ తేదీన సైతాన్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సైతాన్ చిత్రానికి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ఓపెనింగ్ మోస్తరుగానే దక్కినా.. ఆ తర్వాత ఈ మూవీకి కలెక్షన్ల జోరు పెరిగింది. క్రమంగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును ఈ చిత్రం క్రాస్ చేసింది. మొత్తంగా థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత మే 3న ఈ చిత్రం నెట్‍ప్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని తాజాగా బజ్ నడుస్తోంది.

సైతాన్ గురించి..

వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‍గా సైతాన్ వచ్చింది. సైతాన్ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్‍గన్, జ్యోతిక, మాధవన్‍తో పాటు జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీకి అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‍పాండే, అజయ్ దేవ్‍గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా ప్రొడ్యూజ్ చేశారు. సైతాన్ చిత్రానికి సుమారు రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.208.4 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‍గా నిలిచింది.

సైతాన్ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించారు. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సందీప్ ఫ్రాన్సిన్స్ ఎడిటింగ్ చేశారు. టెక్నికల్ విషయంలోనూ ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. దర్శకుడు వికాస్ బహ్ల్ ఈ హారర్ మూవీని పూర్తిస్థాయిలో ఉత్కంఠగా థ్రిల్ కలిగే విధంగా తెరకెక్కించారనే ప్రశంసలు వచ్చాయి.

ఇక, అజయ్ దేవ్‍గణ్ ప్రధాన పాత్ర పోషించిన మైదాన్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. భారత దిగ్గజ ఫుట్‍బాల్ కోచ్, హైదరాబాద్‍కు గర్వకారణమైన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితంపై బయోపిక్‍గా ఈ మూవీ వచ్చింది. 1952 నుంచి 1962 వరకు రహీమ్ కోచింగ్ ఇచ్చిన ఆ కాలం భారత ఫుట్‍బాల్ చరిత్రలో స్వర్ణయుగంగా భావిస్తారు. మైదాన్ సినిమాలో రహీమ్ పాత్రను అజయ్ అద్భుతంగా పోషించారనే ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నా.. వసూళ్లు మోస్తరుగానే దక్కుతున్నాయి.