Chiranjeevi As Villain: సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ.. మరో రెండు సినిమాల్లో అలా!-chiranjeevi played villain role in super star krishna kotta alludu movie super star krishna chiranjeevi movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi As Villain: సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ.. మరో రెండు సినిమాల్లో అలా!

Chiranjeevi As Villain: సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ.. మరో రెండు సినిమాల్లో అలా!

Sanjiv Kumar HT Telugu
May 27, 2024 02:04 PM IST

Chiranjeevi Villain In Super Star Krishna Movie: మెగాస్టార్ చిరంజీవి విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించారు. అలా దివంగత సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఉంది. దీంతో పాటు రెండు సినిమాల్లో కృష్ణ, చిరంజీవి కలిసి నటించారు. అందులో చిరంజీవి రోల్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ.. మరో రెండు సినిమాల్లో అలా!
సూపర్ స్టార్ కృష్ణకు చిరంజీవి విలన్‌గా చేసిన ఒకే ఒక్క మూవీ.. మరో రెండు సినిమాల్లో అలా!

Super Star Krishna Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇటీవల పద్మ విభూషణ్ వంటి అరుదైన అవార్డ్ అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు హీరోగా ఎన్నో మన్ననలు పొందుతున్న చిరంజీని సినీ కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే. తొలుత చాలా వరకు చిత్రాల్లో ప్రతినాయకుడిగా మెప్పించారు.

అంతేకాకుండా ఆ సమయంలో స్టార్ హీరోలకు సైతం విలన్‌గా నటించిన తనదైన ప్రతిభను చూపించారు. చిరంజీవి విలన్‌గా చేసిన హీరోల్లో దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించారు. అందులో ఒకదాంట్లో చిరంజీవి విలన్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమానే 'కొత్త అల్లుడు' (Kotta Alludu Movie).

1979లో విడుదలైన కొత్త అల్లుడు సినిమాలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ చేస్తే.. జయప్రద (Jaya Prada) హీరోయిన్‌గా నటించారు. సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహదేవన్ సంగీతం అందించారు. ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu), కైకాల సత్యనారాయణతోపాటు మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ఈ ముగ్గురు విలన్స్‌గా నటించడం విశేషం.

ఈ ముగ్గురితోపాటు సినిమాలో హేమా చౌదరి, గుమ్మడి వెంకటేశ్వరరావు, నూతన్ ప్రసాద్, రమాప్రభ ఇతరులు యాక్ట్ చేశారు. కొత్త అల్లుడు మూవీలో కైకాల సత్యనారాయణకు తమ్ముడిగా జగన్ పాత్రలో చిరంజీవి నటించి మెప్పించారు. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna Birthday) పుట్టినరోజు అయిన మే 31న 1979లో విడుదలై మంచి హిట్ అందుకుంది. దీనికి ఐమ్‌డీబీ రేటింగ్ 8.3 ఇవ్వడాన్ని బట్టి తెలుస్తోంది ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్‌గా నిలిచిందో.

కొత్త అల్లుడు కథ విషయానికొస్తే.. అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరేలా ఒక కొత్త మెడిసిన్‌ను కనుక్కుంటాడు ఓ ధనిక వ్యక్తి. అతని అల్లుడిగా వచ్చిన వ్యక్తి చంపాలనుకుంటాడు. ఆ తర్వాత సినిమా ఎలాంటి మలుపు తిరిగిందనేది స్టోరీ. ఇక కొత్త అల్లుడు మూవీలో కృష్ణకు విలన్‌గా నటించిన చిరంజీవి మరో సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు. ఆ సినిమానే కొత్తపేట రౌడీ (Kottapeta Rowdy Movie).

ముళ్లపూడి వెంకట రమణ కథ, మాటలు అందించిన కొత్తపేట రౌడీ సినిమాకు కొత్త అల్లుడు డైరెక్టర్ సాంబశివరావు దర్శకత్వం వహించారు. అంటే వరుసగా రెండు సార్లు సాంబశివరావు దర్శకత్వంలో కృష్ణ, చిరంజీవి నటించడం విశేషం. ఆ సినిమా తర్వాతి సంవత్సరం 1980లో మార్చి 7న కొత్త అల్లుడు విడుదలైంది. ఇందులో కూడా జయప్రద హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రంలో ప్రసన్నకుమార్‌గా అతిథి పాత్ర చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఇక కృష్ణ-చిరంజీవి నటించిన మూడో సినిమా తోడు దొంగలు (Thodu Dongalu Movie). ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలుగా నటించడం విశేషం. ఆ సినిమా తర్వాతి సంవత్సరం అంటే 1981లో ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజైంది. కే వాసు దర్శకత్వం వహించిన ఈ మూవీలో రావు గోపాల్ రావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ఎమ్ ప్రభాకర్ రెడ్డి, సాక్షి రంగారావు, సారథి కీలక పాత్రలు పోషించారు.

ఇక హీరోయిన్స్‌గా నటి గీతా, మధుమాలిని చేశారు. బాలీవుడ్ నటి రేఖ ఓ రోల్ చేశారు. కాగా వరుసగా 1979, 80, 81 సంవత్సరాల్లో సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి కలిసి మూడు సినిమాల్లో నటించడం విశేషం. విలన్‌గా, గెస్ట్ రోల్‌లో, కృష్ణకు సమానంగా హీరోగా చిరంజీవి నటించడం ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు.

Whats_app_banner