Krishnamma OTT: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చిన సత్యదేవ్ కృష్ణమ్మ - రివేంజ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Krishnamma OTT: సత్యదేవ్ కృష్ణమ్మ మూవీ థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
Krishnamma OTT: సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. మే 10న కృష్ణమ్మ థియేటర్లలో విడుదలవ్వగా...మే 17న ఓటీటీలోకి ఈ మూవీ రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కృష్ణమ్మ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా కృష్ణమ్మ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.
రివేంజ్ థ్రిల్లర్‌గా...
యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కృష్ణమ్మ మూవీతో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి అగ్ర దర్శకుడు కొరటాల శివ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. కృష్ణమ్మలో సత్యదేవ్‌తో పాటు కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రలు పోషించారు. అతీరారాజ్ హీరోయిన్‌గా నటించింది.
కథలో కొత్తదనం లేకపోవడంతో...
ఈ చిన్న సినిమాకు ప్రజెంటర్‌గా కొరటాల శివ వ్యవహరించడంలో కృష్ణమ్మపై బజ్ బాగానే ఏర్పడింది. ప్రమోషన్స్‌లో సుకుమార్‌తో పాటు పలువురు అగ్ర దర్శకులు పాల్గొనడం, ట్రైలర్, టీజర్స్ ఆకట్టుకోవడంతో గత వారం రిలీజైన తెలుగు సినిమాల్లో కృష్ణమ్మపైనే ఎక్కువ అంచనాలు ఏర్పడ్డాయి.
ఫ్రెండ్‌షిప్, లవ్, రివేంజ్ అంశాలతో దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోవడంతో కృష్ణమ్మ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. రిజల్ట్ తో పాటు థియేటర్ల బంద్ సమస్య వల్ల వారంలోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినట్లు చెబుతోన్నారు.
కృష్ణమ్మ కథ ఇదే...
భద్ర (సత్యదేవ్), శివ(కృష్ణ బూరుగుల), కోటి(లక్ష్మణ్ మీసాల) అనాథలు. మీనా (అతీరారాజ్) అనే అమ్మాయిని శివ ప్రేమిస్తుంటాడు. మీనాను భద్ర కూడా సొంత చెల్లెలిగా భావిస్తుంటాడు. మీనా తల్లి ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం భద్ర, శివ, కోటి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు? అనుకోకుండా ఈ ముగ్గురు స్నేహితులు రేప్ అండ్ మర్డర్ కేసులో చిక్కుకుంటారు?
ఈ హత్య కేసులో భద్ర, శివ, కోటిలను ఇరికించింది ఎవరు? చేయని తప్పును ఒప్పుకోమని పోలీసులు వారిని ఎలా చిత్రహింసలకు గురిచేశారు? తమను తప్పుడు కేసులో ఇరికించిన వారిపై ఈ ముగ్గురు ఫ్రెండ్ ఎలా రివేంజ్ తీర్చుకున్నారన్నదే ఈ మూవీ కథ. కృష్ణమ్మ మూవీకి కాలభైరవ మ్యూజిక్ అందించాడు.
సోలో హీరోగా...
సోలో హీరోగా కమర్షియల్ హిట్టు కోసం సత్యదేవ్ చాలా కాలంగా ఎదురుచూస్తోన్నారు. కృష్ణమ్మతో ఆ కల తీరుతుందని బలంగా నమ్మకం పెట్టుకున్నాడు. కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో సత్యదేవ్ కోరిక తీరలేదు. సోలో హీరోగా అతడు చేసిన గుర్తుందా శీతాకాలం, గాడ్సే, తిమ్మరుసుతో పాటు గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
చిరంజీవి సినిమాలో విలన్...
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో విలన్‌గా సత్యదేవ్ నటించాడు. అక్షయ్ కుమార్ రామ్‌సేతుతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాడు సత్యదేవ్, జీబ్రా, ఫుల్‌బాటిల్‌తో పాటు గరుడ సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. తెలుగులో ఓ రెండు వెబ్‌సిరీస్‌లకు సత్యదేవ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.