Chiranjeevi Getup Srinu: గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!-chiranjeevi about getup srinu and compares with comedy hero chalam over raju yadav movie chiranjeevi getup srinu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Getup Srinu: గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!

Chiranjeevi Getup Srinu: గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!

Sanjiv Kumar HT Telugu
May 20, 2024 02:10 PM IST

Chiranjeevi About Getup Srinu Raju Yadav: జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురింపించారు. గెటప్ శ్రీనును చూస్తుంటే అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారని చెప్పారు. అలాగే రాజు యావద్ సినిమా టీమ్‌కు విషెస్ తెలియజేశారు.

గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!
గెటప్ శ్రీనుపై చిరంజీవి ప్రశంసలు.. అలనాటి కామెడీ హీరో గుర్తుకు వస్తున్నారంటూ!

Chiranjeevi About Getup Srinu: బుల్లితెర కమల్ హాసన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా మారిన విషయం తెలిసిందే. గెటప్ శ్రీను హీరోగా హోల్సమ్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమా రాజు యాదవ్. దీంతో గెటప్ శ్రీను టాలీవుడ్‌లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. అలాగే ఈ మూవీతో కృష్ణమాచారి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు. రాజా యాదవ్ మూవీ మే 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని గెటప్ శ్రీను కలిశాడు.

ఈ సందర్భంగా 'రాజు యాదవ్‌' టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ''గెటప్ శ్రీను.. ఈ పేరు తలచుకోగానే జబర్దస్త్‌లో రకరకాల గెటప్పులు, హావా భావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్లముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను'' అని చిరంజీవి తెలిపారు.

''ఇప్పుడు తను హీరోగా వస్తున్న సినిమా రాజు యాదవ్. ట్రైలర్ చూశాను. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకు వస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు'' అని చిరంజీవి అన్నారు.

''గెటప్ శ్రీను ప్రతిభకు హద్దులు లేవని అనిపిస్తుంటుంది. మే 24న విడుదలయ్యే రాజు యాదవ్ చిత్రం మీ మెప్పు పొందుతుందని, తను హీరోగా మీ మన్ననలని అందుకుంటాడని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మాతలకు, దర్శకుడు కృష్ణమాచారికి, యూనిట్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు. శ్రీను ఆల్ ది వెరీ బెస్ట్'' అని మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

కాగా ఇప్పటికే విడుదలైన రాజు యాదవ్ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. స్టార్ కంపోజర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఆల్బమ్ అందించారని దర్శకులు తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ సైతం వచ్చింది.

రాజు యాదవ్.. లవ్, కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో అలరించనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సాయిరామ్ ఉదయ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఇక రాజు యాదవ్ సినిమాలో గెటప్ శ్రీనుకు జోడీగా అంకిత ఖరత్ హీరోయిన్‌గా చేసింది.

అలాగే రాజు యాదవ్ మూవీలో గెటప్ శ్రీను, అంకిత ఖరత్‌తోపాటు ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల, శ్రీరామ్, కల్యాణ్ భూషణ్, శ్రీమణి, పవన్ రమేష్, ఉత్తర ప్రశాంత్, తదితరులు ఇతర పాత్రలు పోషించారు.