Super Star Krishna: అమెరికాలో తీసిన తొలి తెలుగు సినిమా.. 44 ఏళ్ల నాటి సూపర్ స్టార్ కృష్ణ మూవీ ఏదంటే?
Super Star Krishna Hare Krishna Hello Radha: అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన హరే కృష్ణ హలో రాధ. 44 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఈస్ట్‌మన్ కలర్‌లో వచ్చిన ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలుకుందాం.
First Telugu Movie Shoot In America: ఇప్పుడు టెక్నాలజీ మారింది. సినిమాలను అత్యధిక సాంకేతికతో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ లొకేషన్స్‌లో సినిమాల చిత్రీకరణ జరుగుతున్నాయి. ప్రపంచంలోని ఏ మూలకైన వెళ్లి సినిమా షూటింగ్ చేస్తున్నారు. గతంలో జీన్స్ సినిమాలో ఒక పాటలో ఏడు వింతలు చూపిస్తే అదొ 8వ వింతగా చూసిన సందర్భాలు ఉన్నాయి.
44 ఏళ్ల క్రితం
కానీ, ఇప్పుడు అద్భుతమైన విజువల్స్‌తో మాయ చేస్తూ అందమైన లొకేషన్స్, కాస్ట్‌లీ నగరాల్లో సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా సినిమాలు తెరకెక్కించడం ఖర్చుతో కూడుకున్నప్పటికీ అందులో గొప్పేం లేదనే కామెంట్స్ వినిపిస్తాయి. కానీ, దాదాపు 44 ఏళ్ల క్రితం ఫారెన్‌లో షూటింగ్ అంటే మాత్రం గొప్ప అనే చెప్పుకోవాలి.
తొలి తెలుగు సినిమా
అలాంటి గొప్ప పని, సాహసవంతమైన చర్య చేసింది దివంగత సూపర్ స్టార్ కృష్ణ. అవును, 1980లోనే అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్ స్టార్. సినిమాకు సంబంధించిన విషయాల్లో సూపర్ స్టార్ కృష్ణకు అనేక రికార్డులు ఉన్నాయి.
హరే కృష్ణ హలో రాధ
తొలి జేమ్స్ బాండ్ సినిమా, ఒకే ఏడాది 17 సినిమాల్లో నటించిన ఏకైక హీరోగా వంటి పలు రికార్డ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. అందులో అమెరికాలో తీసిన తొలి తెలుగు చిత్రం కూడా ఆయనదే కావడం విశేషం. ఇక ఆ సినిమా పేరు హరే కృష్ణ హలో రాధ (Hare Krishna Hello Radha Movie). ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సీవీ శ్రీధర్ అందించారు.
గ్రాండ్ కానియన్ లొకేషన్‌లో
హరే కృష్ణ హలో రాధ మూవీలో కృష్ణకు జోడీగా శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీ 1980 సంవత్సరంలో అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను 1969లో వచ్చిన ఫేమస్ హాలీవుడ్ చిత్రం మెకన్నాస్ గోల్డ్ మూవీ (Mackenna's Gold) చిత్రీకరించిన గ్రాండ్ కానియన్ లొకేషన్‌లో (Grand Canyon Location) తీశారు. ఇక్కడ హరే కృష్ణ హలో రాధ మూవీ క్లైమాక్స్ చిత్రీకరించారు.
మూడొంతుల సినిమాను
అంతేకాకుండా ఒక పాట, మరికొన్ని సన్నివేశాలు మినహా మూడొంతుల సినిమాను అమెరికాలో అప్పట్లో చిత్రీకరించి వావ్ అనిపించుకున్నారు నిర్మాతలు. ఈ సినిమాను శ్రీ భరణి చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌లో నిర్మాత బి. భరణీ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో ఈస్ట్‌మన్ కలర్‌లో విడుదలైంది. ఇక ఈ మూవీని శివచంద్రన్ హీరోగా తమిళంలో కూడా రీమేక్ చేయడం విశేషం.
చిన్న ఫ్లాష్ బ్యాక్
ఇదిలా ఉంటే, హీరో కృష్ణకు ఈ మూవీ డైరెక్టర్ శ్రీధర్‌కు చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. తేనె మనసులు సినిమా కంటే ముందుగానే ఓ తమిళ సినిమాతో కృష్ణ హీరోగా పరిచయం కావాల్సి ఉంది. అది శ్రీధర్ నిర్మాణంలో. అంతా కొత్తవాళ్లతో కాదలిక్క నేరమిల్లై అనే సినిమా చేయాలనుకున్న శ్రీధర్ హీరోగా కృష్ణను అనుకున్నారట. తమిళం రాని కృష్ణ ఓ ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నారు.
రవిచంద్రన్‌ను హీరోగా
కానీ, తెలుగు చిత్రాల్లో పేరు తెచ్చుకోవాలనుకున్న కృష్ణకు తమిళం ఒక్క ముక్క కూడా ఎక్కలేదట. వారం గడిచిన కృష్ణకు తమిళం రాకపోయేసరికి కృష్ణను కాదనుకుని తమిళుడైన రవిచంద్రన్‌ను హీరోగా సెలెక్ట్ చేశారట డైరెక్టర్ శ్రీధర్. ఆ సినిమా సూపర్ హిట్ కాగా దాన్ని తెలుగులో ప్రేమించి చూడు టైటిల్‌తో దర్శకనిర్మాత పి. పుల్లయ్య తెరకెక్కించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేశారు.
అమెరికాలోనే చిత్రీకరించాలనే
ఇది జరిగిన 15 ఏళ్లకు మళ్లీ సూపర్ స్టార్ కృష్ణతో హరే కృష్ణ హలో రాధ తెరకెక్కించారు శ్రీధర్. కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయడం కాకుండా అమెరికాలోనే చిత్రీకరించాలన్న భావనతో సినిమా స్టోరీని డెవలప్ చేశారట డైరెక్టర్ శ్రీధర్.