Chaari 111 First Look: జేమ్స్ బాండ్ లుక్‌లో వెన్నెల‌కిషోర్ - చారి 111 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌-vennela kishore chaari 111 movie first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chaari 111 First Look: జేమ్స్ బాండ్ లుక్‌లో వెన్నెల‌కిషోర్ - చారి 111 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Chaari 111 First Look: జేమ్స్ బాండ్ లుక్‌లో వెన్నెల‌కిషోర్ - చారి 111 ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 14, 2023 11:05 AM IST

Chaari 111 First Look: వెన్నెల‌కిషోర్ జేమ్స్ బాండ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అత‌డు హీరోగా చారి 111 పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

వెన్నెల‌కిషోర్ చారి 111  మూవీ
వెన్నెల‌కిషోర్ చారి 111 మూవీ

Chaari 111 First Look: గూఢ‌చారిగా త‌న యాక్ష‌న్ విన్యాసాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు వెన్నెల‌కిషోర్ రెడీ అవుతోన్నాడు. అత‌డు హీరోగా చారి 111 పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. స్పై యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో జేమ్స్ బాండ్ లుక్‌ను అచ్చం దించేశాడు వెన్నెల‌కిషోర్‌.

స్పైగా రివాల్వ‌ర్ గురిపెట్టి సీరియ‌స్ లుక్‌లో క‌నిపించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో జేమ్స్ బాండ్ కారుతో పాటు హైద‌రాబాద్ సిటీలో భారీ బిల్డింగ్‌లు మంట‌ల్లో కాలిపోతున్న‌ట్లుగా చూపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది. చారి 111 సినిమాకు టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.గ‌తంలో సుమంత్‌తో మ‌ళ్లీ మొద‌లైంది అనే సినిమా చేశాడు టీజీ కీర్తికుమార్‌.

కొంత గ్యాప్ త‌ర్వాత అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది కావ‌డం గ‌మ‌నార్హం. చారి 111 సినిమాలో సంయుక్త విశ్వ‌నాథ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ముర‌ళీశ‌ర్మ‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం క‌మెడియ‌న్‌గా వెన్నెల‌కిషోర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గేమ్ ఛేంజ‌ర్‌, ఇండియ‌న్ 2, హ‌నుమాన్‌తో పాటు ప‌లు పాన్ ఇండియ‌న్ సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

IPL_Entry_Point