MS Dhoni : మరోమారు గొప్ప మనసు చాటుకున్న ధోనీ- ఆ అభిమాని సర్జరీ కోసం..!-ms dhoni promised to take care of my surgery says ipl 2024 pitch invader ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni : మరోమారు గొప్ప మనసు చాటుకున్న ధోనీ- ఆ అభిమాని సర్జరీ కోసం..!

MS Dhoni : మరోమారు గొప్ప మనసు చాటుకున్న ధోనీ- ఆ అభిమాని సర్జరీ కోసం..!

Sharath Chitturi HT Telugu
May 31, 2024 01:05 PM IST

MS Dhoni IPL 2024 : ఎంఎస్​ ధోనీ గొప్ప మనసుకు సంబంధించిన మరో ఉదాహరణ బయటకు వచ్చింది. ఓ అభిమాని సర్జరీకి ఖర్చులు భరిస్తానని ధోనీ హామీనిచ్చాడు. అసలేం జరిగిందంటే..

ఎంఎస్​ ధోనీ కాళ్లకు నమస్కరిస్తున్న ఓ అభిమాని..
ఎంఎస్​ ధోనీ కాళ్లకు నమస్కరిస్తున్న ఓ అభిమాని..

MS Dhoni latest news : ఐపీఎల్​ 2024లో అహ్మదాబాద్​ వేదికగా జరిగిన సీఎస్కే వర్సెస్​ జీటీ మ్యాచ్​లో ఓ అభిమాని పరిగెత్తుకుంటూ వెళ్లి.. ఎంఎస్​ ధోనీని కలిసిన దృశ్యాలు మీకు గుర్తున్నాయా? ఈ వీడియో.. ఇన్​స్టెంట్​గా వైరల్​ అయిన విషయం తెలిసిందే. తాజాగా.. ధోనీతో తాను ఏం మాట్లాడాడో వివరించాడు.. ఆ అభిమాని. అది విన్న వారందరు.. ధోనీ గొప్ప మనసుకు మరోమారు ఫిదా అయిపోతున్నారు!

ఇదీ జరిగింది..

మే 10న సీఎస్కే వర్సెస్​ జీటీ మ్యాచ్​ జరిగింది. ధోనీ క్రీజ్​లోకి వచ్చాడు. కొంతసేపటి తర్వాత.. ధోనీ ఎల్​బీడబ్ల్యూని థర్డ్​ అంపైర్​ రివర్స్​ చేశారు. అదే సమయంలో.. ఓ యువకుడు గ్రౌండ్​లోకి దూసుకెళ్లాడు. అది దూరం నుంచే గమనించిన ధోనీ.. ఆ అభిమానిని ఆటపట్టిస్తూ కాస్త దూరం జరిగాడు. చివరికి.. ఆ అభిమాని, ధోనీ దగ్గరికి వెళ్లి, అతని కాళ్లకు నమస్కరించాడు. అభిమానిని పైకి లేపిన ధోనీ.. అతనితో కొన్ని సెకన్ల పాటు మాట్లాడాడు. ఆ వెంటనే.. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి.. ఆ యువకుడిని తీసుకెళ్లిపోయారు. ఇదంతా మనం సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలో చూశాము. అయితే.. ఆ సమయంలో ధోనీతో తాను ఏం మాట్లాడాడో తాజాగా చెప్పాడు ఆ అభిమాని.

MS Dhoni fans : "ధోనీని చూసిన తర్వాత లొంగిపోదామని అనుకున్నాను. ధోనీ అంటే నాకు పిచ్చి! ధోనీ కాళ్లకు నమస్కరించాను. ధోనీ ఒక లెజెండ్​. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ నేను చాలా బిగ్గరగా ఊపిరి తీసుకుంటుండటాన్ని ధోనీ గమనించాడు. నా ముక్కుకు ఉన్న సమస్య గురించి ధోనీకి వివరించాను. "నీకు ఏం కాదు. బాధపడకు. నీకు ఏం జరగకుండా చూసుకుంటాము. భయపడకు. వీళ్లు నిన్ను ఏం చేయరు," అని అన్నాడు. నా సర్జరీకి అయ్యే ఖర్చును చూసుకుంటానని ధోనీ హామీ ఇచ్చాడు. నా కళ్లల్లో నుంచి కన్నీరు ఆగలేదు. అందుకే ధోనీని తలా అని పిలుస్తారు," అని ఆ అభిమాని చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ క్రికెటర్​ ఎంఎస్​ ధోనీ.. ఆన్​ ఫీల్డ్​తో పాటు ఆఫ్​ ఫీల్డ్​లోనూ చాలా ఫేమస్​. అందుకే ధోనీని చాలా మంది దేవుడిలా కొలుస్తారు. ధోనీని ఒక్కసారైనా చూడాలని.. ఐపీఎల్​ 2024లో స్టేడియమ్స్​కి వెళ్లి మద్దతిచ్చారు.

MS Dhoni : ఇక ధోనీ విషయానికొస్తే.. టీమిండియా మాజీ క్రికెటర్​ ఇంటర్నేషనల్​ మ్యాచ్​లు ఆడట్లేదు. ఐపీఎల్​ ఒక్కటే ఆడుతూ వచ్చాడు. మరి ఐపీఎల్​ 2024 అతని చివరి సీజన్​ అవుతుందా? లేదా? అన్న దానిపై ధోనీ క్లారిటీ ఇవ్వలేదు. ఇంకొంత సమయం తీసుకుని, ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని.. ధోనీ, సీఎస్కేకి చెప్పినట్టు సమాచారం.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం