Sleep Problem and Food : నిద్ర రావట్లేదా? ఈ ఆహారం తీసుకోండి
Sleep Problem and Food : మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు మన శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి. తీసుకునే ఫుడ్ ఆరోగ్యంతోపాటుగా.. నిద్ర వచ్చేలా ఉండాలి. నిద్రలేమితో బాధపడేవారు.. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే.. మంచిది.
ఈ కాలంలో చాలామందికి నిద్రలేమి సమస్య(Sleeping Problem) ఉంది. రాత్రి ఎంత టైమ్ అయినా నిద్ర రాదు. దీంతో లేనిపోని ఆరోగ్య సమస్యలు(Health Issues). ఆసుపత్రుల చుట్టూ తిరగడం. అందుకే సరైన ఆహారం(Food) తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీవనశైలి(Lifestyle) నిద్ర సమస్యకు ప్రధాన కారణం. అయితే దీనితో మనం తినే ఆహారం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరానికి విశ్రాంతినిచ్చే ఆహారపదార్థలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.
వివిధ రకాల ఆహారాలు మీకు నచ్చినా.. మంచి, చెడు రెండు రకాలైన ఫలితం ఉంటుంది. దీంతో సమస్యలు వస్తాయి. మాంసంహారం(Non Veg), పిజ్జా, ఫాస్ట్‌ఫుడ్ లాంటి మితిమీరిన శాచురేటెడ్ ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల మన నిద్రావస్థ మీద ప్రభావం పడుతుంది. మద్యపాన(Liquor) తీసుకోవడంతో నిద్రరావడం విశ్రాంతిలా అనిపించినా.. దానితో నిద్రలేమి సమస్య వస్తుంది. అధిక కెఫిన్ శరీరానికి చేరినపుడు కూడా నిద్ర మీద ప్రభావం ఉంటుంది. కాఫీ, టీ, పానీయాలు, చాకోలెట్‌లు, ఎనర్జీ డ్రింక్‌లు కూడా నిద్రపై ప్రభావం చూపిస్తాయి. మసాలా ఆహారం సేవించడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రపోవడానికి గంట ముందే ఆహారం తీసుకోవాలి.
సాల్మన్ చేపను పుడ్ లో చేర్చండి.. ఇవి సిరొటోనిన్‌ని నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది శరీరానికి నిద్రను వచ్చేలా చేస్తుంది. టార్ట్ చెర్రి తీసుకోవడం శరీరానికి నిద్ర(Sleep)పోయేలా చేస్తుంది. రాత్రి భోజన సమయంలో ఈ పండు లేదా జ్యూస్ తీసుకోవాలి. సూక్ష్మపోషకాంశాలను కలిగి ఉన్న కొన్ని ఆహార పదార్ధాలు నిద్రపై తగినంత ప్రభావం చూపుతాయి.
శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగితే నిద్ర వస్తుంది. పడుకునే ముందు కొన్ని వాల్‌నట్స్ తినడం ద్వారా ఈ హర్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్ వంటి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని(Heart Health) మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
ఓట్స్.. అమైనో ఆసిడ్, ట్రిప్టోఫాన్‌న పదార్థాలతో కూడిన మూలంగా ఉంది. ఇది మెలటోనిన్, సిరొటోనిన్ విడుదలకు సహాయం చేస్తుంది. ఈ హార్మోన్‌నల విడుదలకు తగినట్లుగా సహకరించండి. ఓట్స్(oats) తీసుకోవడం బరువు నియంత్రణకు మంచిది.
సాధారణంగా మంచి ఆహారంతో పాటు జీవనశైలి చాలా ముఖ్యం. స్క్రీన్‌టైమ్(Screen Time) నియంత్రణ, నిద్రించే వాతావరణం, ఉష్ణోగ్రతలు పడుకునేముందు చూసుకోవాలి.