Oats Pesarattu Recipe : ఆరోగ్యాన్నిచ్చే ఓట్స్ పెసరట్టు.. రుచిలో సూపర్ హిట్టు..
Oats Pesarattu Recipe : పెసరట్టు ఆరోగ్యానికి మంచిది అంటారు. అయితే దాని బెనిఫిట్స్ మరింత పెంచాలి అనుకుంటే మీరు ఓట్స్ పెసరట్టును ప్రయత్నించవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. పైగా ఆరోగ్యానికి మంచిది. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oats Pesarattu Recipe : ఆరోగ్యం కోసం మనం ఎన్నో ఆహారాలను దూరం పెడతాం. అలాగే.. కొన్ని ఆహారాలను డైట్లో చేర్చుకుంటాము. అలాగే మీరు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు ఓట్స్ పెసరట్టుని ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మంచి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
* పెసరపప్పు - 1 కప్పు.. 3 గంటలు నానబెట్టాలి
* ఓట్స్ పిండి - 1 కప్పు
* అల్లం - 1 అంగుళం
* పచ్చిమిర్చి - 2
* ఉప్పు - రుచికి తగినంత
* నూనె - పెసరట్టు వేయడానికి కావాల్సినంత
ఓట్స్ పెసరట్టు తయారీ విధానం
అల్లం, పచ్చిమిర్చితో పాటు పెసలను మిక్సీ గ్రైండర్‌లో వేసి.. మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. దానిని దోశ పిండి కంటే కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఈ పిండిని పెద్ద గిన్నెలోకి మార్చి.. ఓట్స్ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు దోసె పాన్‌ను వేడి చేసి.. కొద్దిగా నూనె అప్లై చేసి.. దానిపై ఓట్స్ పెసరపిండిని వేసి.. దోశలాగా వేయాలి. ఉడికిన తర్వాత మరోవైపు దానిని మార్చాలి. అంతే వేడి వేడి హెల్తీ, టేస్టీ ఓట్స్ పెసరట్టు రెడీ. దీనిని మీరు కొబ్బరి చట్నీతో కలిపి లాగించేయవచ్చు.
సంబంధిత కథనం