Chicken Potato Tikki Recipe : బ్రేక్‌ఫాస్ట్‌కి గ్రీన్ చట్నీతో.. చికెన్, ఆలు టిక్కీలు..
Chicken Potato Tikki Recipe : ఉదయాన్నే టేస్టీగా, క్రంచీగా ఉండే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే.. మీరు చికెన్ టిక్కీలను ట్రై చేయాల్సిందే. పైగా వీటిని తయారుచేయడం కూడా చాలా సులభం. పిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టంగా తినే వంటకాలలో ఇది కచ్చితంగా ఉంటుంది.
Chicken Potato kabab Recipe : సాధారణంగా కబాబ్స్ చేయడం చాలా కష్టం అనుకుంటారు. అయితే ఇది ఈ చికెన్, ఆలు కబాబ్ చేయడం చాలా సులభం. అంతేకాదు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పైగా దీనికోసం గంటల గంటలు మేరినేషన్ చేయాల్సిన అవసరమే లేదు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బంగాళా దుంపలు - 250 గ్రాములు (ఉడికించినది)
* చికెన్ - 250 గ్రాములు (ఉడికించినది)
* గరం మసాలా - 1 టీస్పూన్
* ఉప్పు - రుచికి తగినంత
* జీలకర్ర పొడి - 1 టీస్పూన్
* సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
* పెప్పర్ - 1/2 టీస్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* కారం - రుచికి తగినంత
* పుదీనా - టేబుల్ స్పూన్
* గుడ్లు - 2
* బ్రెడ్‌క్రంబ్స్ - 1 కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని.. దానిలో ఉడికించిన బంగాళదుంపలను వేసి.. వాటిని మెత్తగా స్మాష్ చేయండి. ఇప్పుడు దానిలో చికెన్‌తో వేసి గరం మసాలా, ఉప్పు, జీరా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా ఆకులు, సోయా సాస్, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి.
అనంతరం మిశ్రమం నుంచి చిన్న భాగాలను తీసుకుని.. దాన్ని రోల్ చేసి.. టిక్కీలు చేయండి. వాటిని గుడ్డులో ముంచి.. బ్రెడ్‌క్రంబ్స్‌తో కోట్ చేయండి. ఇలా అన్ని టిక్కీలను కోట్ చేసి.. వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేయండి. అంతే వేడి వేడి కబాబ్‌లు రెడీ. దీనిని మీకు నచ్చిన సాస్ లేదా గ్రీన్ చట్నీతో లాగించేయవచ్చు.
సంబంధిత కథనం