తెలుగు న్యూస్ / ఫోటో /
Liver Health | మద్యపానమే కాదు.. పండ్లు ఎక్కువగా తింటే కూడా లివర్ చెడిపోతుందట!
- కేవలం మద్యం సేవిస్తేనే కాదు అధిక మోతాదులో పండ్లు తీసుకోవడం, ప్రతిరోజూ బ్రెడ్ తినడం ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కాలేయం దెబ్బతింటుంది. కాలేయానికి చెడు చేసే 5 ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
- కేవలం మద్యం సేవిస్తేనే కాదు అధిక మోతాదులో పండ్లు తీసుకోవడం, ప్రతిరోజూ బ్రెడ్ తినడం ఇతర ఆహారపు అలవాట్ల కారణంగా కూడా కాలేయం దెబ్బతింటుంది. కాలేయానికి చెడు చేసే 5 ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)
శరీరంలోని సుమారు 500కి పైగా విధులకు కాలేయం బాధ్యత వహిస్తుంది. ఫ్యాటీ లివర్, థైరాయిడ్ అసమతుల్యత, కొవ్వు పెరగటం లేదా చర్మం సమస్యలు, జుట్టు రాలటం మొదలగు అనేక సమస్యలకు కాలేయం ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి శరీరంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందుగా మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. కాలేయ ఆరోగ్యం, పనితీరుపై హోలిస్టిక్ న్యూట్రిషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఫౌండర్ ల్యూక్ కౌటిన్హో కొన్ని సూచనలు చేశారు.(Getty Images/iStockphoto)
(2 / 7)
పండ్లు తీసుకోవడం మంచిదే కానీ అది మోతాదుకి మించితేనే ప్రమాదం. ఒకదాని తర్వాత ఒకటి పండ్లను తింటూ ఉండతం, ఫ్రూట్ బౌల్స్, ఫ్రూట్ ప్లేటర్‌లు ఇలా అన్ని మోతాదుకు మించి తింటూ పోతే శరీరంలో ఫ్రక్టోజ్ శాతం పెరుగుతుంది. ఇది నాన్- ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రమాదానికి దారితీస్తుంది. రోజుకి 1-2 పండ్లు మాత్రమే తినాలని సిఫారసు చేస్తున్నారు.
(3 / 7)
సోడా వాటర్, కూల్ డ్రింక్స్, అలాగే బుడగలు కనిపించే ఎరేటెడ్ పానీయాలు తీసుకోవడం కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది.(Pixabay)
(4 / 7)
బ్రెడ్ అలాగే ఇతర బేకరీ ఉత్పత్తులను శుద్ధి చేసిన చక్కెర, పిండి, పామాయిల్, ట్రాన్స్ ఫ్యాట్ మొదలైన ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలతో తయారు చేస్తారు. ఇవన్నీ కాలేయానికి శత్రువులు.
(5 / 7)
నిల్వ చేసిన మాంసం, అధిక ఎరుపు మాంసం, శుద్ధి చేసిన మాంసంలో ఉప్పు, నైట్రేట్లు, ఇతర ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉంటాయి. ఈ రకమైన మాంసం తింటే అది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని కలిగిస్తుంది.(Shutterstock)
(6 / 7)
ఇక చివరది, అతి ముఖ్యమైనది ఏమిటంటే అతిగా మద్యపానం సేవించడం. మీ శరీరంలో ఆల్కాహాల్ మోతాదు ఎక్కువైతే అది మీ కాలేయాన్ని గందరగోళానికి గురి చేస్తుంది. కాలేయం పనితీరు దెబ్బతింటే అది అల్కాహాలును ఫిల్టర్ చేయదు. దీంతో విషపూరితంగా మారి లివర్ డ్యామేజ్ అవుతుంది. ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది.
ఇతర గ్యాలరీలు