World Liver Day 2022 | కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే అంతే సంగతులు..
మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి కాలేయం. దీని కథ అంతా వేరు ఉంటాది. అన్ని వ్యాధులలాగా దీని లక్షణాలు ముందు కనిపించవు. పూర్తిగా కాలేయం చెడిపోయిన తర్వాతే దాని సమస్యలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మరి కాలేయం పాడవకుండా మనం ఏం చేయాలి? ఎలాంటి రక్షణ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలోని అన్ని అవయవాలు ముఖ్యమైనవే. కానీ వాటిలో కాలేయం కొంచెం భిన్నం. ఎందుకంటే.. ఏ సమస్య వచ్చినా.. శరీరం ముందే సంకేతాలు ఇస్తుంది. కానీ కాలేయం విషయంలో అలా కాదు. పూర్తిగా భిన్నం. కాలేయం పూర్తిగా నాశనం అయ్యే వరకు ఎలాంటి సంకేతాలను ఇవ్వదు. కాబట్టి ఎటువంటి సమస్యలు లేవని కాలేయాన్ని శ్రద్ధ చూపకపోవడం కచ్చితంగా ముప్పే అంటున్నారు నిపుణులు.
కాబట్టి కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యవసరం. వయస్సు, జన్యుశాస్త్రం, మధుమేహం, ఊబకాయం వంటి అంశాలు మీ కాలేయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మీ అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
వ్యాయామం..
మీ రోజువారీ దినచర్యలో 30 నిమిషాల పాటు ఏదైనా వ్యాయామాన్ని చేయండి. మీ శారీరక శ్రమ ఎంత పెరిగితే.. మీ కాలేయ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఊబకాయం, పెరిగిన బరువు, అధిక రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇవి కాలేయానికి హానికరం కాబట్టి.. ఆరోగ్యకరమైన బరువును పొందేందుకు.. శారీరక శ్రమ, వ్యాయామం అవసరం.
ఆరోగ్యకరమైన ఆహారం..
సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు.. తృణధాన్యాలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కాలేయంలో కొవ్వు తగ్గించడానికి ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
ఒత్తిడి తగ్గించుకోండి..
ఒత్తిడి-సంబంధిత వ్యాధులు చాలా సాధారణం. ఇవి గుండె సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. ఒత్తిడి అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఇది గుండె ప్రమాదాలను కలిగిస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలు కాలేయ సమస్యలను పెంచుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి.
చెడు అలవాట్లకు దూరంగా..
మద్యం, ధూమపానం కాలేయ వైఫల్యాన్ని మరింత స్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి. పేలవమైన కాలేయ ఆరోగ్యం ఉన్న వారు... ఆల్కహాల్, ధూమపానం మానేయడం చాలా ముఖ్యం.
సంబంధిత కథనం