Types of Salts । ఉప్పులో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ ఉప్పు తినడం ఆరోగ్యకరం!
Types of Salts: మనకు మార్కెట్లో చాలా రకాల లవణాలు అందుబాటులో ఉంటాయి, అయితే వీటి మధ్య తేడా ఏమిటి, ఏది ఆరోగ్యకరమైన ఉప్పు అనేది ఇక్కడ తెలుసుకోండి.
Types of Salts: మనం దాదాపు ప్రతీ వంటకంలో ఉప్పు వేసుకుంటాం, ప్రతిరోజూ ఉప్పు తింటాం. అయితే మనలో చాలా మంది తెల్లగా కర్పూరంలా ఉండే ఉప్పును మాత్రమే వాడతారు. కానీ మనకు మార్కెట్లో చాలా రకాల లవణాలు అందుబాటులో ఉంటాయి. అవి టేబుల్ ఉప్పు, రాతి ఉప్పు, అయోడైజ్డ్ ఉప్పు, హిమాలయన్ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటూ రకరకాల పేర్లతో ఉంటాయి. అయితే వీటి మధ్య తేడా ఏమిటి, ఇందులో ఏది ఆరోగ్యకరమైనదో చాలా మందికి తెలియకపోవచ్చు. అందుకే మీకోసం ఉప్పు గురించి ఇక్కడ కొంత సమాచారం అందిస్తున్నాం.
ఆహారాలలో కలపడానికి ప్రధానంగా టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్, రాక్ సాల్ట్ ఉపయోగిస్తారు. ముందుగా వీటి మధ్య తేడా ఏమిటో తెలుసుకోండి.
రాతి ఉప్పు
రాక్ సాల్ట్ అనేది శుద్ధి చేయని ఉప్పు. శుద్ధి చేయరు కాబట్టి ఈ ఉప్పు కాస్త మలినంగా ముదురు రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రకమైన ఉప్పులో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైన సహజ ఖనిజ పదార్ధాలు ఎక్కువ ఉంటాయి. ఈ కారణంగా రాక్ సాల్ట్ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.
టేబుల్ సాల్ట్
టేబుల్ సాల్ట్ అనేది సాధారణమైన ఉప్పు, ఇది ఎక్కువగా శుద్ధి చేసిన ఉప్పు. కాబట్టి ఈ ఉప్పు తెల్లగా నిగనిగలాడుతూ కర్పూరంలా మెరుస్తుంది. అయితే ఇందులో ఎలాంటి మినరల్స్ ఉండవు, కేవలం ఇందులో సోడియం మాత్రమే ఉంటుంది. దీనిని నాన్-అయోడైజ్డ్ ఉప్పు వర్గంలో చేర్చవచ్చు.
అయోడైజ్డ్ ఉప్పు
మరోవైపు అయోడైజ్డ్ ఉప్పు అనేది టేబుల్ సాల్ట్ కు మరో రూపమే. టేబుల్ సాల్ట్ కు అయోడిన్ సమ్మేళనాలతో కలిపినపుడు అది అయోడైజ్డ్ ఉప్పు అవుతుంది. ఇది అయోడిన్ పోషకంను అందిస్తుంది కాబట్టి థైరాయిడ్ పనితీరుకు ఇది సరైనది.
Which is Healthiest Salt- ఏ ఉప్పు ఆరోగ్యకరమైనది?
మీ శరీరానికి మినరల్స్ ఎక్కువ అందించాలనుకుంటే ఈ మూడింటిలో రాతి ఉప్పు వాడటం మంచిది. అందులోనూ హిమాలయన్ పింక్ సాల్ట్ మంచిదంటారు. అయితే మీరు అయోడిన్ లోపం వలన బాధపడుతుంటే కచ్చితంగా అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి లేదా అయోడిన్ లభించే ఇతర వనరులను తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు రుచి కోసం ఏ ఉప్పునైనా ఉపయోగించవచ్చు.
మనం ఎన్ని రకాల పదార్థాలు వేసి వంట చేసినప్పటికీ, ఆ వంటకు రుచిని అందించేది కేవలం ఉప్పు మాత్రమేనని మీ అందరికీ తెలిసిందే. ఉప్పులేని చప్పటి తిండిని తినడానికి ఎవరూ ఇష్టపడరు.
కానీ, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా హైబీపీ ఉన్నవారు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు, చిన్నపిల్లలు ఉప్పును చాలా తక్కువ (salt intake) తీసుకోవాలి.
అయోడైజ్డ్ సాల్ట్ మినహా మిగతా ఉప్పు రకాలలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. శరీరంలో సోడియం ఎక్కువైతే మీకు ముప్పు ఎక్కువైనట్లే. ఈ ప్రకారంగా సంపూర్ణంగా ఆరోగ్యకరమైన, సురక్షితమైన ఉప్పు అంటూ ఏదీ లేదు. అందువల్ల ఉప్పు తినడం తగ్గించాలని మాత్రమే వైద్యులు సూచిస్తున్నారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించడం వలన రుచిని పెంచవచ్చు, ఈ రకంగా ఉప్పు వాడకాన్ని తగ్గించాలి, అలాగే తాజా పండ్లు ఆహారంగా తినాలి, అప్పుడు సోడియం శాతం తగ్గించినట్లు అవుతుందని అంటున్నారు.
సంబంధిత కథనం