Salt and Sugar intake: కొంతమంది టీలో చాలా ఎక్కువ చక్కెర వేసుకొని తాగుతారు, స్వీట్స్ కూడా అధికంగా తింటారు. అలాగే ఆహారంలోనూ ఉప్పుకారాలు చాలా తింటారు. గుండె ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం రోజూవారీగా తీసుకునే ఉప్పు, చక్కెరలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. చక్కెర ఎక్కువ తీసుకుంటే అది మిమ్మల్ని ఊబకాయంలోకి నెట్టివేస్తుంది, క్రమంగా మధుమేహం వైపు దారితీస్తుంది, అథెరోస్ల్కెరోసిస్ వంటి ధమనుల సమస్యకు కారణం అవుతుంది. ఇవన్నీ మీరు గుండె జబ్బులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.
మరోవైపు, ఉప్పు ఎక్కువ తీసుకున్నా మీ ఆరోగ్యానికి నష్టమే. అదనపు సోడియం మీ రక్తపోటు స్థాయిలను పెంచుతుంది, మీలో కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు ప్రశాంతంగా ఉండలేరు. మానసికంగా, శారీరకంగా ఇది కూడా బలహీనపడతారు. ఇది క్రమంగా గుండె జబ్బులకు కారణం అవుతుంది. రక్తపోటు అనేది అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్య. మీకు అధిక రక్తపోటు ఉన్నట్లయితే, మీరు ఆహారంలో ఉప్పును చాలా తగ్గించాలి.
అందువల్ల ఉప్పు ఎక్కువైనా మీ గుండెకు నష్టమే, చక్కెర ఎక్కువైనా గుండెకు నష్టమే. అదనంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని చాలా తగ్గించాలి, మితంగా తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు, చక్కెరల వినియోగాన్ని ఎలా తగ్గించవచ్చో నిపుణులు కొన్ని సూచనలు చేశారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నా ఆహారాలను తగ్గించండి. మీ ఆహారాలలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ పెంచండి.
సంబంధిత కథనం