Pistachios for Sleep | రాత్రి తొమ్మిదింటికి పిస్తా తినండి, పదయ్యేసరికి నిద్రలోకి జారుకుంటారు!
Pistachios for Sleep: బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలో చాలా చిట్కాలు ఉన్నాయి. అయితే ఆయుర్వేద వైద్యులు పిస్తాలు తింటే చాలంటున్నారు. ఇవి తింటే లైంగిక శక్తి కూడా పెరుగుతుందట. మరింత చదవండి..
Sleeping Tips: నిద్ర మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మన ఆరోగ్యం, శ్రేయస్సుతో పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంది. మన దైనందిన జీవితాన్ని గైడ్ చేస్తుంది. సరైన నిద్రలేకపోతే అలసట, తలనొప్పి, మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి. నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి, భావోద్వేగ సమతుల్యత తగ్గిపోతుంది, మెదడు పనితీరు దెబ్బతింటుంది. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 9 గంటల ప్రశాంతమైన నిద్రను కలిగి ఉండాలి.
మీ నిద్ర చక్రం ద్వారానే మీ రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలుగుతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ సైటోకిన్‌లను విడుదల చేస్తుంది, ఇవి ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా పోరాడటానికి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీకు రక్షణగా ఉంటాయి. సరైన నిద్రలేకపోతే, శరీరంలో వీటి ఉత్పత్తి తగ్గుతుంది. ఎవరైనా వ్యక్తి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారంటే, నిద్రలేమి ఒక ముఖ్య కారణం. మీ జీవనశైలి విధానాలే కాదు, ముఖ్యమైన పోషకాల లోపం కూడా నిద్రలేమి కారణం కావచ్చు.
కొన్ని ఆహార పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, అవి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు నిద్రలేమి సమస్యలను కూడా తీరుస్తాయి. అటువంటి ఆహార పదార్థాలలో నట్స్, డ్రైఫ్రూట్స్ ముందుంటాయి.
Eat Pistachio for Better Sleep- రాత్రికి పిస్తా తింటే సుఖమైన నిద్ర
ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్. దీక్ష ప్రకారం, పిస్తా పప్పు తినడం ద్వారా నిద్రనాణ్యత మెరుగుపడుతుంది. ఎందుకంటే శరీరంలో మెలటోనిన్ స్థాయిలు పెరిగినపుడు మనకు నిద్రపోయే భావన కలుగుతుంది. మెలటోనిన్ అనే సమ్మేళనం మనకు త్వరగా నిద్రపోవడానికి, ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడే చాలా మందికి 1mg నుంచి 3mg వరకు మెలటోనిన్ మాత్రలను వైద్యులు సిఫారసు చేస్తారు.
అయితే పిస్తాలో ఈ మెలటోనిన్ అనేది సహజంగానే అత్యధిక మొత్తంలో ఉంటుంది. అందుకే బాగా నిద్రపోవాలన్నా, నిద్ర నాణ్యత మెరుగుపడాలన్నా పిస్తా తింటే చాలని డాక్టర్ దీక్ష అన్నారు. మంచి నిద్రరాక ఇబ్బంది పడుతున్న వారు మెలటోనిన్, మెగ్నీషియం వంటి మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు 1 గంట ముందు పిస్తాపప్పులు తీసుకోవాలని నేను సూచిస్తున్నారు. ఉదాహారణకు మీరు రోజూ పదింటికి పడుకునేవారైతే తొమ్మిందిటికి కొన్ని పిస్తా పలుకులు తినే ప్రయత్నం చేయండి.
పిస్తాపప్పు తినడం వల్ల మన శరీరానికి మెగ్నీషియం, విటమిన్ బి6 కూడా అందుతాయి. మెగ్నీషియం మీకు త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా.. గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందడంలోనూ పాత్ర పోషిస్తుంది. విటమిన్ B6 అనేదు GABA, ట్రిప్టోఫాన్, సెరోటోనిన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇవన్నీ నిద్రపై ప్రభావం చూపుతాయి. ట్రిప్టోఫాన్ ఒక అమైనో ఆమ్లం, ఇది సెరోటోనిన్ ఉత్పత్తిలో పాత్ర పోషిస్తుంది, ఇది మన మానసిక స్థితిని స్థిరీకరించడంలో సహాయపడే ఒక హ్యాపీ హార్మోన్.
ఆయుర్వేదానికి సంబంధించిన పిస్తాపప్పులు వాత-శమకా, గురు, ఉష్ణ ప్రభావాలు కలిగినవి. ఆందోళన, నిద్రలేమి, విపరీత ఆహార కోరికలు, ఊబకాయం ఉన్నవారికి వీటిని తినడం చక్కని పరిష్కారం. మరోవైపు ఇవి ఆకలిని, లైంగిక శక్తిని, మానసిక స్థితి, నిద్రను కూడా మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అని డాక్టర్ దీక్ష వివరించారు.
అయితే పిస్తాను అతిగా కూడా తినకూడదని నిపుణుల అభిప్రాయం, ఎందుకంటే ఇవి మైగ్రేన్ లక్షణాలను ప్రేరేపించవచ్చు.
నిద్రలేమి, చెదిరిన నిద్ర, అతిగా ఆలోచించడం, ఆందోళనతో బాధపడేవారికి ఆయుర్వేద మూలికలైన బ్రహ్మి, అశ్వగంధ, జటామాన్సి, టాగర్, శాఖపుష్పి మొదలైన మూలికలను పాలు లేదా నీటితో కలిపి తీసుకోవాలని డాక్టర్ సిఫార్సు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిద్రలేమి సమస్య ఇంకా కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
సంబంధిత కథనం