Stress Relief Tips : ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇదిగో 10 మార్గాలు
Stress and Anxiety Reduce Tips : ఈ మధ్యకాలంలో ఒత్తిడితో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన జీవితంలో పాటించే విధానాలతో దీనిని తగ్గించుకోవచ్చు.
డిప్రెషన్‌తో బాధపడేవారు నిద్రలేమి, అలసట, నీరసం, డిప్రెషన్, అసంతృప్తితో ఉంటారు. నేటి యుగంలో పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి పని చేసే యువత, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి, ఆందోళన పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడికి లోనైతే ఆలోచనలు ఘోరంగా ఉంటాయి. ఒత్తిడి మానసిక స్థితిని మాత్రమే కాకుండా శారీరక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
జీవితాంతం అందరికీ సుఖం లభించదు.. ఇదే సత్యం. అందరికీ దుఃఖం కూడా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు కామన్. ముందుగానే దాని కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తులో సమస్యల గురించి తెలుసుకుంటే మానసికంగా మిమ్మల్ని మీరు ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. ఇది కష్టాలను అధిగమించే మానసిక శక్తిని ఇస్తుంది.
మీ ఒత్తిడి సమయంలో మీ స్నేహితులు, బంధువులతో ఉంటే మంచిది. ఎందుకంటే వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యం ఇస్తారు.
ఏం జరుగుతుందో, ఏమి జరగబోతోందో తెలుసుకోవాలి. ఇది మీ ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తుంది. ఈ ప్రక్రియ మీ ఆలోచనలను మరింత స్పష్టం చేస్తుంది. మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉండాలి.
మీ ఒత్తిడితో కూడిన భావాలను ఇతరులకు తెలియజేయడం ఒక గొప్ప మార్గం. మీరు మీ కోరికలు, ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా తెలపాలి. దాని గురించి నిజాయితీగా ఉండడాలి. ఇది మీ సంబంధాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, సత్యాన్ని అంగీకరించండి. దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే సత్యాన్ని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదు. జీవితంలో జరిగేది అదే.
చాలా మంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధూమపానం, మద్యం, డ్రగ్స్ ఆశ్రయిస్తారు. మీకు కొంత సమయం అవసరమైతే ఒత్తిడిని మరచిపోయేలా చేస్తుంది. కానీ అంతర్లీనంగా ఉన్న సమస్య అంతం కాదు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆల్కహాల్, కెఫిన్, డ్రగ్స్, మత్తుమందులు తీసుకోకండి.
ఇతరులతో మీ సంబంధాలు సంతృప్తికరంగా, బాధాకరంగా, ఒత్తిడితో కూడుకున్నవిగా కూడా ఉంటాయి. అందుకే మీ చుట్టూ ఉన్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉంటేనే మంచిది. అది మీ స్నేహితులు, బంధువులు లేదా పరిచయస్తులు కూడా కావచ్చు.
మీరు ఆరోగ్యంగా ఉంటే ఒత్తిడిని దూరం చేయెుచ్చు. మీ బలాన్ని, సమతుల్యతను కాపాడుకోవడానికి రోజువారీ జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి పోషకమైన ఆహారం తీసుకోండి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి, ఒత్తిడిని తగ్గించండి, తగినంత నిద్ర పోవాలి. మీ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం లైఫ్ ని ఎంజాయ్ చేసేందుకు కేటాయించాలి.
ఒత్తిడి భరించలేనంతగా ఉంటే వెంటనే సైకియాట్రిస్ట్‌ని సంప్రదించాలి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మీ జీవితాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది.
ముందుగా ఒత్తిడితో కూడిన సమస్యను గుర్తించండి. ఇది మీ సమస్యను సులభంగా పరిష్కరించడంలో మీకు ఉపయోగపడుతుంది.