Fruits Seed Disadvantages : ఈ పండ్లు తింటే ఆరోగ్యం.. కానీ వాటి విత్తనాలు విషం!-never eat these fruits seed its dangerous to health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fruits Seed Disadvantages : ఈ పండ్లు తింటే ఆరోగ్యం.. కానీ వాటి విత్తనాలు విషం!

Fruits Seed Disadvantages : ఈ పండ్లు తింటే ఆరోగ్యం.. కానీ వాటి విత్తనాలు విషం!

Anand Sai HT Telugu
Jan 27, 2024 01:00 PM IST

Fruits Seed Disadvantages Telugu : పండ్లు ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని రకాల పండ్ల విత్తనాలను మాత్రం తినడం మంచిది కాదు. ఎందుకో తెలుసుకోండి.

పండ్లు
పండ్లు (unsplash)

మార్కెట్లో దొరికే చాలా పండ్లను తీసుకొచ్చి తింటాం. అయితే వాటిలోని విత్తనాలను తిడడం మాత్రం మంచిది కాదు. చాలా ప్రమాదకరం. కొన్ని రకాల పండ్లు అమృతమైనా.. వాటి విత్తనాలు మాత్రం విషమనే చెప్పాలి. అలాంటి పండ్ల గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. దాంతోపాటుగా ఏమి తినకూడదో కూడా తెలియాలి. సమతుల్య ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండాలి. కానీ అన్ని పండ్లు, కూరగాయలు మానవ ఆరోగ్యానికి సురక్షితం కాదు.

మనం తినే కొన్ని పండ్లు ఆరోగ్యానికి మంచి చేస్తాయనేది అందరికీ తెలుసు. కానీ వాటి విత్తనాలు హానికరం. ఇలాంటి పండ్లు కొన్ని ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైంది. విషపూరితమైన విత్తనాలతో కూడిన అటువంటి రుచికరమైన పండ్ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

లిచీ పండు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కచ్చితంగా తినాల్సిన పండు. కానీ దీని విత్తనాలు మాత్రం మన శరీరానికి హానికరం. ఇది శరీరానికి విషపూరితం అని చెబుతారు. ఆరోగ్య పరిశోధనల ప్రకారం ఇందులోని కొన్ని అమైనో ఆమ్లాలు మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేసేలా ఉంటాయి. మెదడు వాపుకు కూడా దారితీస్తాయని చెబుతారు. లిచీ పండ్ల విత్తనాలకు దూరంగా ఉండండి.

టొమాటో పండు మనం రోజూ ఆరోగ్యంలో చాలా అవసరం. ఉడికించిన టమోటాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టమోటా గింజలను పచ్చిగా తినకూడదు. ఎందుకంటే ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. టమాటా గింజల్లో ఆక్సలేట్ ఉంటుంది. టొమాటో గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి.

రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. గుండె సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. మన ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. యాపిల్స్‌లో పోషకాలు ఎంత పుష్కలంగా ఉంటాయి. కానీ వాటి విత్తనాలు మనిషి ఆరోగ్యానికి సైనైడ్ లాంటివని ఆరోగ్య నిపుణులు చెబుతారు. యాపిల్ గింజల్లో హైడ్రోజన్ సైనైడ్ ఉంటుంది. యాపిల్ గింజలను తినవద్దు.

పైన చెప్పిన విత్తనాలు మన శరీరంపై చాలా విషపూరితమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆప్రికాట్లు, రేగు, చెర్రీస్, పీచెస్ వంటి వాటి విత్తనాలు కూడా తినొద్దు. మీరు ఈ పండ్లను మాత్రమే తినాలి. ఈ విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

WhatsApp channel

టాపిక్