Man booked for harassing minor girl: ఈ దారుణం కర్నాటకలో ఉన్న మాండ్య జిల్లాలోని నాగమంగల పట్టణంలో జరిగింది. ఆ బాలిక ఇంటి ఎదురింట్లో ఉండే యూనస్ పాషా అలియాస్ ఫయాజ్ మొహమ్మద్ ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు రావడంతో, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మొదట యూనస్ పాషా ఆ బాలికకు ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తరువాత క్రమంగా ఆ బాలికతో వీడియో కాల్స్ మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె అర్థనగ్న ఫొటోలను తీసి, ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. బాలిక తల్లిదండ్రులు వేరే ఊరికి వెళ్లడం గమనించి, బాలికతో పాటు ఉన్న ఆమె నానమ్మకు సాంబారులో నిద్రమాత్రలు కలిపి, స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం, ఆ బాలికను బెదిరించి, అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన ఆ బాలికను మతం మారితే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తరువాత ఆ బాలిక ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గమనించారు. ఆ బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. దాంతో, వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడైన యూనస్ పాషాపై, ఇటీవల అమల్లోకి వచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టం( anti-conversion Act), పొక్సొ(POCSO)తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టాపిక్