Food Cravings । విపరీతమైన ఆహార కోరికలు ఉన్నాయా? నివారించే ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!-craving for eating try these 5 ayurvedic tips to help curb food cravings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food Cravings । విపరీతమైన ఆహార కోరికలు ఉన్నాయా? నివారించే ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!

Food Cravings । విపరీతమైన ఆహార కోరికలు ఉన్నాయా? నివారించే ఆయుర్వేద చిట్కాలు ఇవిగో!

Jan 08, 2024, 07:05 PM IST Akanksha Agnihotri
Apr 04, 2023, 10:10 PM , IST

Food Cravings: ఆకలి వేయడం సహజం, కానీ విపరీతంగా ఆకలివేయడం, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనే కోరికలు కలగడం అసహజం. ఈ సమస్యను నివారించడానికి ఆయుర్వేద చిట్కాలను చూడండి.

పేగు వ్యాధి, కాండిడా లేదా AMA వంటి శారీరక వ్యాధులు, సెలీనియం వంటి పోషకాహార లోపాలు, ఒత్తిడి ఆందోళన మొదలైన కారణాల వలన కూడా అసహజమైన ఆహార  కోరికలు కలుగుతాయి  అని ఆయుర్వేద వైద్యురాలు, వెల్నెస్ కోచ్ డాక్టర్ వరలక్ష్మి చెప్పారు. ఈ సమస్యను నివారించే ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను ఆమె తెలిపారు. 

(1 / 7)

పేగు వ్యాధి, కాండిడా లేదా AMA వంటి శారీరక వ్యాధులు, సెలీనియం వంటి పోషకాహార లోపాలు, ఒత్తిడి ఆందోళన మొదలైన కారణాల వలన కూడా అసహజమైన ఆహార  కోరికలు కలుగుతాయి  అని ఆయుర్వేద వైద్యురాలు, వెల్నెస్ కోచ్ డాక్టర్ వరలక్ష్మి చెప్పారు. ఈ సమస్యను నివారించే ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను ఆమె తెలిపారు. (Shutterstock)

ఆరు రుచుల పోషకాహారం:  ఆరు రుచులను కలిగి ఉన్న తాజాగా సిద్ధం చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో తియ్యటి ధాన్యాలు లేదా పిండి పదార్థాలు, ఉప్పు, పులుపు ఆహారాలు, ఘాటైన రుచి కోసం సుగంధ దినుసులు, చేదు రుచి కోసం ఆకుకూరలు, వగరు పదార్థాలు తీసుకోవాలి. 

(2 / 7)

ఆరు రుచుల పోషకాహారం:  ఆరు రుచులను కలిగి ఉన్న తాజాగా సిద్ధం చేసిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇందులో తియ్యటి ధాన్యాలు లేదా పిండి పదార్థాలు, ఉప్పు, పులుపు ఆహారాలు, ఘాటైన రుచి కోసం సుగంధ దినుసులు, చేదు రుచి కోసం ఆకుకూరలు, వగరు పదార్థాలు తీసుకోవాలి. (Pixabay)

సరైన నిద్ర: అర్ధ రాత్రి వరకు మెలకువగా ఉంటే ఆహార కోరికలు పెరుగుతాయి. రాత్రి 11 గంటలలోపు నిద్రపోవాలి, తగినంత నిద్ర తీసుకోవాలి. 

(3 / 7)

సరైన నిద్ర: అర్ధ రాత్రి వరకు మెలకువగా ఉంటే ఆహార కోరికలు పెరుగుతాయి. రాత్రి 11 గంటలలోపు నిద్రపోవాలి, తగినంత నిద్ర తీసుకోవాలి. (Unsplash)

సోంఫ్ విత్తనాలు:  భోజనానంతరం సోంపును నమలడం ఆచారంగా పెట్టుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాక, శ్వాసను తాజాగా ఉంచుతుంది.   

(4 / 7)

సోంఫ్ విత్తనాలు:  భోజనానంతరం సోంపును నమలడం ఆచారంగా పెట్టుకోవాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాక, శ్వాసను తాజాగా ఉంచుతుంది.   (Pixabay)

మొదటి ముద్ద తియ్యగా:   ఆహారం భుజించేటపుడు మొదట తీపి రుచిని కలిగి ఉండాలి లేదా నెయ్యి తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది, పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. అతిగా తినడం నిరోధించడంలో సహాయపడుతుంది. 

(5 / 7)

మొదటి ముద్ద తియ్యగా:   ఆహారం భుజించేటపుడు మొదట తీపి రుచిని కలిగి ఉండాలి లేదా నెయ్యి తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది, పోషకాలను బాగా గ్రహించడానికి సహాయపడుతుంది. అతిగా తినడం నిరోధించడంలో సహాయపడుతుంది. (Shutterstock)

నడక: జీర్ణక్రియలో సహాయపడటానికి, సుమారు 100 అడుగులు నడకకు వెళ్లాలి లేదా వజ్రాసనంలో కూర్చోవాలని సూచించారు. ఇది జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, ఉబ్బరం తగ్గించడానికి,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

(6 / 7)

నడక: జీర్ణక్రియలో సహాయపడటానికి, సుమారు 100 అడుగులు నడకకు వెళ్లాలి లేదా వజ్రాసనంలో కూర్చోవాలని సూచించారు. ఇది జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, ఉబ్బరం తగ్గించడానికి,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. (Grand Master Akshar)

శొంఠి తీసుకోండి:  వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు, వంటకాల్లో శొంఠిని  చేర్చుకోవాలి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ,  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

(7 / 7)

శొంఠి తీసుకోండి:  వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు, వంటకాల్లో శొంఠిని  చేర్చుకోవాలి. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ,  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.(Shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు