Varun Sandesh: యద్భావం తద్భవతి అంటున్న వరుణ్ సందేశ్.. థ్రిల్లర్ జోనర్‌లో సినిమా-varun sandesh new movie yadhbhavam thadhbhavathi first look poster release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Sandesh: యద్భావం తద్భవతి అంటున్న వరుణ్ సందేశ్.. థ్రిల్లర్ జోనర్‌లో సినిమా

Varun Sandesh: యద్భావం తద్భవతి అంటున్న వరుణ్ సందేశ్.. థ్రిల్లర్ జోనర్‌లో సినిమా

Maragani Govardhan HT Telugu
Jul 21, 2022 08:53 PM IST

హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం యద్భావం తద్భవతి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా గురించి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

వరుణ్ సందేశ్
వరుణ్ సందేశ్ (Twitter)

కెరీర్ ప్రారంభంలో వరుసగా హిట్లు అందుకున్న వరుణ్ సందేశ్.. ఆ తర్వాతి కాలంలో స్లో అయ్యారు. సినిమాలు వరుసగా ఫ్లాపులు బాట పట్టడం, కథల ఎంపికలో ఈ హీరో జడ్జిమెంట్ కరెక్టుగా లేకపోవడం పలు కారణాల వల్ల కెరీర్‌ అంత ఆశజనకంగా సాగలేదు. మూడేళ్ల క్రితం బిగ్‌బాస్‌లో సందడి చేసిన యువ హీరో అప్పటి నుంచి మళ్లీ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాది ఇప్పటికే ఇందువదన అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన వరుణ్.. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు. అతడు నటిస్తోన్న సరికొత్త చిత్రం యాద్భావం తద్భవతి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ రోజు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో సందీప్‌ కిషన్ ఆవిష్కరించి చిత్రబృందానికి విషెస్ చెప్పారు. 'యద్భావం తద్భవతి' అంటే సంస్కృతంలో మనస్సులో ఏమైతే అనుకుంటామో బయట కూడా జరగడాన్ని ఈ విధంగా సంబోధిస్తారు. ఈ సినిమా టైటిల్‌కు అనుగుణంగా చిత్ర కథాంశం కూడా ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన ఇనాయ సుల్తాన హీరోయిన్‌గా చేస్తోంది. రమేశ్ జక్కాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రసన్నా భూమి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రసన్న లక్ష్మీ భూమి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

త్వరలోనే చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహించనున్నారు. అనంతరం చిత్ర ట్రైలర్, టీజర్ లాంటి అప్డేట్లను తెలియజేసి.. విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాపై ఇంతకుమించి వివరాలను తెలియపరచలేదు మేకర్స్. త్వరలోనే మరిన్ని వివరాలను అధికారింకగా ప్రకటించనున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్