Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3పై అప్‍డేట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..-some more days amazon prime video ott gives update on mirzapur season 3 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3పై అప్‍డేట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3పై అప్‍డేట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2024 09:02 PM IST

Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3 కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అమెజాన్ ప్రైమ్ వీడియో టీజ్ చేస్తూ వస్తోంది. నేడు ఓ పోస్టర్‌తో అప్‍డేట్ ఇచ్చింది.

Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3పై అప్‍డేట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3పై అప్‍డేట్ ఇచ్చిన ప్రైమ్ వీడియో.. స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..

Mirzapur Season 3: మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకులు చాలా వేచిచూస్తున్నారు. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్‍లో రెండు సీజన్లు చాలా పాపులర్ అయ్యాయి. అత్యధిక వ్యూస్ దక్కించుకున్న చూసిన ఇండియన్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. అంతలా మీర్జాపూర్ రెండు సీజన్లు సక్సెస్ అయ్యాయి. కాగా, మూడో సీజన్ కోసం సుమారు రెండేళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మీర్జాపూర్ మూడో సీజన్ గురించి నేడు (మే 28) మరోసారి టీజ్ చేసింది.

కొన్ని రోజులు ఆగండి అంటూ..

మీర్జాపూర్ సీజన్ 3 కోసం మరికొన్ని రోజులు ఆగాలంటూ నేడు (మే 28) ఓ పోస్టర్ రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. కుర్చీపై అలీ ఫైజల్ (గుడ్డు) కూర్చున్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చు?

మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఇంకా కొన్ని రోజులు ఆగాలని ప్రైమ్ వీడియో పేర్కొంది. అయితే, ఈ సీజన్ ఈ ఏడాది జూన్ లేకపోతే జూలైలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. 2022లోనే ఈ సీజన్ షూటింగ్ మొదలైంది. అయితే, కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాదే ఈ సీజన్‍ను తీసుకురావాలని ప్రైమ్ వీడియో తొలుత భావించింది. అయితే, చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది 2024 జూన్, జూలై మధ్య మీర్జాపూర్ మూడో సీజన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మున్నా భయ్యాను గుడ్డు చంపేయయం.. కలీన్ భయ్యా, శరద్ చేతులు కలపడంతో మీర్జాపూర్ రెండో సీజన్ ముగిసింది. దీంతో మీర్జాపూర్‌ కోసం ఆధిపత్యం పోరులో పరిస్థితులు మారిపోయాయి. మూడో సీజన్‍లో కుర్చీ కోసం కుట్రలు, కుతంత్రాలు మరింత రంజుగా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‍లో కొన్ని సర్‌ప్రైజ్ ట్విస్టులు కూడా ఉంటాయనే రూమర్లు ఉన్నాయి.

మీర్జాపూర్ వెబ్ సిరీస్‍లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, విక్రాంత్ మాసే, శ్రీయా పిల్‍గోవాంకర్, కుల్‍భూషణ్ ఖర్బంద, రసిక దుగ్గల్, శ్వేత త్రిపాఠి, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ ఆయుష్మాన్‍, పునీత్ కృష్ణ ఈ సిరీస్‍కు క్రియేటర్లుగా ఉన్నారు. కరణ్ అనుష్మాన్‍తో పాటు గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఆనంద్ భాస్కర్ సంగీతం అందించారు.

ఎట్టకేలకు వచ్చేసిన పంచాయత్ సీజన్ 3

పంచాయత్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చేసింది. ఈ సీజన్ కోసం కూడా చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ మూడో సీజన్ నేడు (మే 28) స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీజన్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. రూరల్ పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ సీజన్‍కు దర్శకత్వం వహించారు దీపక్ కుమార్ మిశ్రా. జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా, ఫైజల్ మాలిక్, చందన్ రాయ్, దుర్గేశ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.

టీ20 వరల్డ్ కప్ 2024