Mirzapur 3: మీర్జాపూర్ 3 గురించి కీలక విషయం వెల్లడించిన దివ్యేందు.. మున్నా భయ్యా ఉంటాడా.. లేదా?
Mirzapur Season 3: మీర్జాపూర్ సీజన్ 3 కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సీజన్‍లో మున్నా భయ్యా పాత్ర కనిపిస్తుందా లేదా అనేది టెన్షన్‍గా మారింది. ఈ విషయంపై దివ్యేందు తాజాగా మాట్లాడారు.
Mirzapur 3: మీర్జాపూర్ వెబ్ సిరీస్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ మూడో సీజన్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఎప్పుడెప్పుడు తీసుకొస్తుందా అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్ గురించి ఈవెంట్‍లో వెల్లడించింది ప్రైమ్ వీడియో. దీంతో త్వరలోనే మీర్జాపూర్ మూడో సీజన్ వస్తుందని హింట్ ఇచ్చింది. అయితే, సీజన్ 2 చివర్లో మరణించిన మున్నా భయ్యా మళ్లీ మూడో సీజన్‍లో కనిపిస్తాడా లేదా అనే విషయం టాక్ ఆఫ్ ది టౌన్‍గా మారింది. అయితే, ఈ విషయంపై తాజాగా స్పందించారు మున్నా భయ్యా పాత్ర చేసిన దివ్యేందు.
దివ్యేందు పోషించిన మున్నా భయ్యా పాత్ర మీర్జాపూర్ సీజన్ 2 చివర్లో చనిపోతుంది. అయితే, మున్నా నిజంగా చనిపోయాడా.. దీని వెనుక మిస్టరీ ఏమైనా ఉందా అంటూ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. మూడో సీజన్‍ను ప్రైమ్ వీడియో ప్రకటించాక ఈ చర్చ జోరుగా సాగుతోంది. అయితే, ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో.. దివ్యేందు ఫొటోతో ఓ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. హిందీ సినిమాల్లో హీరోను ఎవరూ చంపలేరంటూ దాని సారాంశంగా ఉంది. దీంతో.. మూడో సీజన్‍లో మున్నా భయ్యా కనిపిస్తాడన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే, మీర్జాపూర్ మూడో సీజన్‍లో తన మున్నా భయ్యా పాత్ర ఉండదని దివ్యేందు తాజాగా చెప్పారు.
దివ్యేందు చెప్పిందిదే..
హ్యూమన్స్ ఆఫ్ బాడీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యేందు తాజాగా మాట్లాడారు. తాను పోషించిన మున్నా భయ్యా పాత్ర మీర్జాపూర్ సీజన్ 3లో ఉంటుందా అనే విషయంపై స్పందించారు. సీజన్ 2 చివర్లో చనిపోయినా మున్నా పాత్ర మళ్లీ మూడో సీజన్‍లో తిరిగి రాదని దివ్యేందు వెల్లడించారు.
నిజమేనా!
మున్నా భయ్యా పాత్ర మీర్జాపూర్ 3 సీజన్‍లో ఉండదని దివ్యేందు చెప్పినా.. ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజమేనా.. కావాలనే దీన్ని సీక్రెట్‍గా ఉంచుతున్నారా అనే సందేహాలు ఉన్నాయి. మూడో సీజన్‍లో మున్నా భయ్యా రీఎంట్రీని బిగ్ సర్‌ప్రైజ్‍గా టీమ్ ప్లాన్ చేస్తోందని, అందుకే ముందుగా దీన్ని రివీల్ చేసేందుకు ఇష్టపడడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి, మీర్జాపూర్ సీజన్ 3లో మున్నా భయ్యా ఉంటాడో.. లేదో చూడాలి.
మీర్జాపూర్ సిరీస్‍లో తనకు ముందుగా మున్నా భయ్యా పాత్రకు కాకుండా.. బబ్లూ క్యారెక్టర్ వచ్చిందని కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పారు దివ్యేందు. అయితే, ఆ తర్వాత మున్నా క్యారెక్టర్‌కు సరిపోతారని టీమ్ భావించిందని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్లు ఇంత సక్సెస్ అయ్యేందుకు అద్భుతమైన స్క్రిప్ట్ కారణమని ఆయన చెప్పారు.
మీర్జాపూర్ వెబ్ సిరీస్‍లో తొలి రెండు సీజన్లలో పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్, విక్రాంత్ మాసే, శ్రీయా పిగాంకర్, కుల్‍భూషణ్ కర్బంద కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు కరణ్ అనుష్మాన్, గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కరణ్ ఆయుష్మాన్‍తో పాటు పునీత్ కృష్ణ క్రియేటర్లుగా ఉన్నారు. మూడో సీజన్ స్ట్రీమింగ్ గురించి అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.