Mirzapur season 3: త్వరలోనే మీర్జాపూర్ మూడో సీజన్: హింట్ ఇచ్చిన నటి
Mirzapur 3: మీర్జాపూర్ సీజన్ 3 త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‍లో నటిస్తున్న రసిక దుగ్గల్ పోస్ట్ చేసిన ఫొటోతో అంచనాలు వెలువడుతున్నాయి.
Mirzapur Season 3: మీర్జాపూర్ వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు రాగా.. వ్యూవర్‌షిప్‍లో రెండూ అదరగొట్టాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ వెబ్ సిరీస్‍ను చాలా మంది ప్రేక్షకులు చూశారు. క్రైమ్ నేపథ్యంలో చాలా ట్విస్టులతో సాగే ఈ సిరీస్‍కు ఆదరణ లభించింది. 2018లో తొలి సీజన్ రాగా.. 2020లో రెండో సీజన్ విడుదలైంది. ఈ రెండు సీజన్లకు రికార్డుస్థాయిలో వ్యూవర్ షిప్ వచ్చింది. దీంతో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‍గా మీర్జాపూర్ నిలిచింది. అయితే, మీర్జాపూర్ 3వ సీజన్ కూడా సిద్ధమవుతోంది.
కలీన్ భాయ్ పాత్రలో పంకజ్ త్రిపాఠి, గుడ్డూగా అలీ ఫైజల్, బబ్లూగా విక్రాంత్ మసే, మున్నా పాత్రలో దివ్యేందు, కలీన్ భార్య బీనా త్రిపాఠి పాత్రలో రసిక దుగ్గల్.. మీర్జాపూర్ సీజన్‍లో నటిస్తున్నారు. కరణ్ అన్షుమన్, పునీత్ కృష్ణ, గర్మీత్ సింగ్ ఈ మీర్జాపూర్ సిరీస్‍ను రూపొందించారు. ప్రస్తుతం ఈ సిరీస్ మూడో సీజన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా, తాజాగా ఈ సిరీస్‍లో నటిస్తున్న రసిక దుగ్గల్ ఓ ఫొటోను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది. తాను మూడో సీజన్ కోసం డబ్బింగ్ చెబుతున్న ఫొటోను షేర్ చేసింది.
రసిక దుగ్గల్ ఈ ఫొటో షేర్ చేయటంతో మీర్జాపూర్ 3వ సీజన్ త్వరలో విడుదలవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అతిత్వరలో అనౌన్స్‌మెంట్ రానుందని తెలుస్తోంది.
ఇప్పటికే మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయి కొన్ని నెలలు అయింది. ఈ సీజన్ కోసం ఈ సిరీస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2018 నవంబర్ 16వ తేదీన మీర్జాపూర్ తొలి సీజన్ 9 ఎపిసోడ్‍లతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. అదిరిపోయే ట్విస్టులు, గ్రిప్పింగ్ స్టోరీ, క్యారెక్టర్ల అద్భుత నటనతో ఈ సిరీస్ తక్కువకాలంలోనే పాపులర్ అయింది. 2020 అక్టోబర్ 2వ తేదీన రెండో సీజన్ వచ్చింది. ఈ రెండో సీజన్ మరింత హిట్ అయింది.
శ్వేత త్రిపాఠి శర్మ, కుల్‍భూషణ్ కర్బంద, శ్రీయా పిగ్లయోనక్, విజయ్ శర్మ, ఈశా తల్వార్ కూడా మీర్జాపూర్‌లో కీలకపాత్రలు పోషించారు. ఆనంద్ భాస్కర్ ఈ వెబ్ సిరీస్‍కు మ్యూజిక్ అందిస్తున్నాడు.