Cyclone Remal: భారత్, బంగ్లాదేశ్ ల్లో 16 మంది ప్రాణాలు తీసిన రెమల్ తుపాను
Cyclone Remal: ఈ సంవత్సరం తొలి తుపాను అయిన రెమల్.. బంగ్లాదేశ్, భారత్ లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ తుపాను కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
(1 / 12)
ఈ ఏడాది తొలి పెను తుపాను రెమాల్ తుపాను తీరప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా బంగ్లాదేశ్, భారత్ లలో 16 మంది మరణించారు.(AFP)
(2 / 12)
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 మంది చనిపోయారని బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ, సహాయ శాఖ మంత్రి మొహిబుర్ రెహ్మాన్ మంగళవారం తెలిపారు.(REUTERS)
(3 / 12)
మృతుల్లో కొందరు నీటమునిగిపోగా, మరికొందరు ఇళ్లు కూలడంతో చనిపోయారని తీర ప్రాంత అధికారులు తెలిపారు.(PTI)
(4 / 12)
మృతుల్లో భోలా, బరిసాల్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, సత్ఖిరా, ఖుల్నా, చిట్టగాంగ్, పతువాఖలి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. (AFP)
(5 / 12)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.(AFP)
(6 / 12)
ఇరు దేశాలు దాదాపు పది లక్షల మందిని తుఫాను షెల్టర్లకు తరలించాయని, బంగ్లాదేశ్లో 8 లక్షల మందిని, భారత్లో సుమారు 1,10,000 మందిని తరలించామని అధికారులు తెలిపారు.(AFP)
(7 / 12)
ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, సోమవారం ఉదయం 'రెమల్' తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.(AFP)
(8 / 12)
రెమల్ తుపాను ఆదివారం తీరం దాటడంతో బంగ్లాదేశ్, భారత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడటం, చెట్లు నేలకూలడంతో లక్షలాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.(REUTERS)
(9 / 12)
ప్రమాదాలను నివారించడానికి బంగ్లాదేశ్ లో అధికారులు ముందుగానే అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారని, చెట్లు విరిగిపడటం, లైన్లు తెగిపోవడంతో అనేక తీరప్రాంత పట్టణాలు చీకట్లోనే ఉండిపోయాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.(ANI)
(10 / 12)
కోల్ కతాలో రెమల్ తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై, పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.(AFP)
(11 / 12)
రెమాల్ తుఫాను కారణంగా కోల్కతా విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను 21 గంటల పాటు నిలిపివేశారు.(ANI)
ఇతర గ్యాలరీలు