Balakrishna: నన్ను వద్దు.. వాళ్లను ఇన్‍స్పిరేషన్‍గా తీసుకోవాలని మోక్షజ్ఞకు చెప్పా: బాలకృష్ణ
Nandamuri Balakrishna - Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు బాలకృష్ణ హాజరయ్యారు. తన మార్క్ స్పీచ్‍తో అదగొట్టారు. తన కుమారుడు మోక్షజ్ఞకు ఇచ్చిన సలహా గురించి కూడా వెల్లడించారు.
Balakrishna: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ సమీపించింది. ఈ రూరల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మే 31వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (మే 28) ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఈవెంట్‍కు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుమారుడు మోక్షజ్ఞ గురించి కూడా చెప్పారు.
నన్ను ఇన్‍స్పిరేషన్‍గా తీసుకోవద్దన్నా..
తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలోనే ఉంటుందనేలా బాలకృష్ణ చెప్పారు. అయితే, తనను స్ఫూర్తి (ఇన్‍స్పిరేషన్)గా తీసుకోవద్దని మోక్షజ్ఞకు తాను చెప్పానని ఆయన తెలిపారు. విశ్వక్‍సేన్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువ నటులను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించినట్టు చెప్పారు. “మావాడు ఉన్నాడు మోక్షు. రేపు అతడు రావాలి ఇండస్ట్రీకి. నన్ను ఇన్‍స్పిరేషన్‍గా తీసుకోవద్దని మోక్షజ్ఞకు ఎప్పుడూ చెబుతా. విశ్వక్‍సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అడివి శేష్ లాంచి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పా” అని బాలకృష్ణ అన్నారు.
మమ్మల్ని కవలలు అంటారు
తనను, విశ్వక్‍సేన్‍ను చూసిన వారు కొందరు కవలలు అంటారని సరదాగా అన్నారు బాలకృష్ణ. తనకు విశ్వక్ సోదరుడి లాంటి వాడని చెప్పారు. ఇండస్ట్రీలో తాను చాలా కొంత మందితోనే ఉంటానని బాలయ్య చెప్పారు. “విశ్వక్ కంటే నేను చిన్నోడినే” అంటూ సరదాగా అన్నారు. విశ్వక్‍సేన్‍లో ప్యాషన్ చాలా ఉందని, తనకు అతడికి మధ్య అదే సారూప్యత అని బాలయ్య చెప్పారు.
అప్పుడు ఏడ్చేశా..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్ సమయంలో తన కాలికి పెద్ద గాయమైందని విశ్వక్‍సేన్ చెప్పారు. అప్పుడు బాలయ్య తనకు ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడారని, అప్పుడు తనకు కన్నీళ్లు వచ్చాయని విశ్వక్ అన్నారు. తనకు గాయమైందని బాలయ్య చాలా బాధపడ్డారని, అది ఆయన వాయిస్‍లో తనకు అర్థమైందని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత అప్పుడు తాను ఏడ్చానని అన్నారు. ఫ్యామిలీ తర్వాత తనపై అంత ప్రేమ చూపించిన వారు తక్కువని విశ్వక్ చెప్పారు.
నా గ్యాంగ్‍లో ఆ ముగ్గురు
సినీ ఇండస్ట్రీలో తన గ్యాంగ్‍లో ముగ్గురు ఉన్నారని బాలకృష్ణ చెప్పారు. విశ్వక్‍సేన్, సిద్దు జొన్నలగడ్డతో పాటు అడివి శేష్ తన గ్రూప్‍లో ఉన్నారని చెప్పారు.
కమెడియన్ హైపర్ ఆది చేసిన ఓ కామెంట్ ఈ ఈవెంట్‍కు హైలైట్‍గా నిలిచింది. నందమూరి నటసింహం (బాలకృష్ణ), కొణిదెల కొదమసింహం (పవన్ కల్యాణ్) కలిసి రేప్పొద్దున అసెంబ్లీలో కలిసి అడుగుపెడితే ఎలాంటి కిక్ వస్తుందో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అలాంటి కిక్ ఇస్తుందని ఆది అన్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ గెలుపు పక్కా అనేలా దీమా వ్యక్తం చేశారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విశ్వక్‍సేన్‍కు జోడీగా నేహా శెట్టి నటించారు. అంజలి, గోపరాజు రమణ, హైపర్ ఆది, సాయికుమార్ కీరోల్స్ చేశారు. ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.