మే 29, నేటి రాశి ఫలాలు.. ఎంతో కాలంగా చికాకు పెడుతున్న సమస్య నుంచి గట్టెక్కుతారు-today may 29th rasi phalalu check mesha rasi to meena rasi results in telugu daily horoscope ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 29, నేటి రాశి ఫలాలు.. ఎంతో కాలంగా చికాకు పెడుతున్న సమస్య నుంచి గట్టెక్కుతారు

మే 29, నేటి రాశి ఫలాలు.. ఎంతో కాలంగా చికాకు పెడుతున్న సమస్య నుంచి గట్టెక్కుతారు

HT Telugu Desk HT Telugu
May 29, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ29.05.2024 బుధవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 29వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 29వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 29.05.2024

వారం: బుధవారం, తిథి : షష్టి

నక్షత్రం : శ్రవణ, మాసం : వైశాఖము,

సంవత్సరం: శ్రీ కోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. దీర్ఘకాలిక సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ఎంతోకాలంగా రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహావిష్ణువు ఆలయాన్ని దర్శించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. భాగస్వాముల నుంచి ప్రోత్సాహం. ఉద్యోగస్తులకు చిక్కులు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభాలు. సోదరులు, సోదరీలతో విభేదాల పరిష్కారమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం కృష్ణుని ఆలయాలు దర్శించటం మంచిది. కృష్ణాష్టకం పఠించాలి.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొంటారు. చిరకాల ప్రత్యర్థులను ఆకర్షిస్తారు. అప్పుల బాధల నుంచి విముక్తి. సోదరులతో అస్తుల విషయంలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శ్రీమన్నారాయణుడు/ శ్రీమహావిష్ణువుకు సంబంధించిన ఆలయాన్ని దర్శించడం మంచిది. విష్ణుమూర్తి ఆలయాలలో అర్చన జరిపించుకోవాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఇంటిలో నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుగాయి. విద్యార్థులకు అనుకూల సమయం. స్థిరాస్తి వివాదాలు తీరే అవకాశముంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరిస్తాయి. ఉద్యోగులు విధుల్లో సత్తా చాటుకుంటారు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పఠించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు అవకాశం. ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు. కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది. బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతోకాలంగా చికాకుపరుస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్య నమస్కారం చేయటం మంచిది. గురు దక్షిణామూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగస్తులకు ఆటంకాలు తొలగుతాయి. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి ఉంటుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలేర్పడతాయి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న చికాకులు నెరవేరతాయి. వాహనాలు కొంటారు. సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకూలం. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో అర్చన వంటివి చేయాలి. మహావిష్ణువు అష్టోత్తర శతనామావళి పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొనసాగిస్తారు. బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులుంటాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలుంటాయి. రావలసిన సొమ్ము అందుతుంది. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వృశ్చికరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుని ఆలయాన్ని దర్శించాలి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలుంటాయి. ఆకస్మిక ధనలాభం. పేరుకుపోయిన బాకీలు అందుతాయి. కుటుంబసభ్యులతో ఆనందముగా ఉంటారు. సమస్యలు చాకచక్యంగా పరిష్కారమవుతాయి. విలువైన సమాచారం రాగలదు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకోని లాభాలు, పెట్టుబడులుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు తొలగుతాయి. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం వినాయకుని పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు అనివార్యం. రాజకీయ నాయకులకు ఊహించని పదవులు దక్కుతాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. అనేక రకాలుగా ధనలబ్ది ఉంటుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మంచిది. మహా విష్ణువు ఆలయాన్ని దర్శించటం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి. ప్రత్యర్థులు స్నేహితులవుతారు. అవసరాలకు లోటు ఉండదు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు రావచ్చు. కుటుంబ సభ్యులకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయండి. విష్ణుమూర్తి అష్టోత్తర నామాలను పఠించండి.

మీన రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఆస్తుల వ్యవహారంలో లబ్ధి పొందుతారు. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఒప్పందాలుంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో పురోగతి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రామాలయాలను దర్శించండి. రామకోటి వంటివి రాయటం మంచిది. తారకమంత్రం పరించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel