Sriranga Neethulu Premiere: ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకి వస్తున్న సుహాస్ సినిమా! డేట్ ఇదే-suhas movie siranganeethulu set to premiere on youtube amid ott deal failure ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sriranga Neethulu Premiere: ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకి వస్తున్న సుహాస్ సినిమా! డేట్ ఇదే

Sriranga Neethulu Premiere: ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకి వస్తున్న సుహాస్ సినిమా! డేట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2024 07:09 PM IST

Sriranga Neethulu Premiere date: శ్రీరంగనీతులు సినిమా ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకే రానుంది. ఈ మూవీ ప్రీమియర్ డేట్ కూడా ఖరారైంది. ఓటీటీ డీల్ లేకపోవడంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Sriranga Neethulu Premiere: ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకి వస్తున్న సుహాస్ సినిమా! డేట్ ఇదే
Sriranga Neethulu Premiere: ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకి వస్తున్న సుహాస్ సినిమా! డేట్ ఇదే

Sriranga Neethulu Movie: హీరోగా సుహాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్‍బ్యాండ్‍తో మంచి హిట్ కొట్టారు. ఇటీవల మేలోనే వచ్చిన ప్రసన్నవదనం చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంది పర్ఫార్మెన్స్ చేసింది. అయితే, సుహాస్ హీరోగా చేసిన శ్రీరంగనీతులు చిత్రం కూడా ఈ ఏడాదే వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 11వ తేదీన విడుదలైంది. కానీ ఈ మూవీ ప్లాఫ్ అయింది. ఈ చిత్రం వచ్చినట్టు కూడా చాలా మంది తెలియలేదు. ఇప్పుడు, ఈ శ్రీరంగనీతులు చిత్రం ఓటీటీలో కాకుండా యూట్యూబ్‍లోకే వచ్చేయనుంది.

ప్రీమియర్ ఎప్పుడంటే..

శ్రీరంగనీతులు సినిమా మే 30వ తేదీన యూట్యూబ్‍లో శ్రీభవానీ హెచ్‍డీ మూవీస్ ఛానెల్‍‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది ఆ ఛానెల్. మే 30న ఈ చిత్రం ప్రీమియర్ అవుతుందని పేర్కొంది. దీంతో ఈ చిత్రాన్ని యూట్యూబ్‍లో ఉచితంగా చూడొచ్చు.

ఓటీటీ డీల్ జరగలేదా?

శ్రీరంగనీతులు సినిమా ఘోరంగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలోనూ క్లారిటీ రాలేదు. సోనీ లివ్ ఓటీటీ ఈ మూవీని కొనుగోలు చేసిందని ఇటీవల రూమర్లు వచ్చాయి. అయితే, యూట్యూబ్‍లో మే 30న రానుండటంతో ఈ మూవీకి ఓటీటీ డీల్ జరగలేదనే అర్థమవుతోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శ్రీరంగనీతులు చిత్రంలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలు ఒక్కక్కరికి జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారన్న విషయంపై ఈ మూవీని తెరకెక్కించారు. రాగ్ మయూర్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసారల, దేవీప్రసాద్ కీలకపాత్రలు పోషించారు.

శ్రీరంగనీతులు చిత్రం ఏప్రిల్ 11న ఈ చిత్రం రిలీజ్ కాగా.. మిక్స్డ్ టాక్ వచ్చింది. థియేటర్లలో ఎక్కువ కాలం నడవలేకపోయింది. ఈ మూవీకి ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ పెద్దగా చేయలేదు. దీంతో ఈ చిత్రం రిలీజైనట్టు కూడా చాలా మందికి తెలియలేదు.

శ్రీరంగనీతులు చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, అజయ్ అరసాద సంగీతం అందించారు. రాధావి ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వర రావు బల్మూరీ నిర్మించారు.

ఓటీటీలో అదరగొడుతున్న ప్రసన్నవదనం

సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్‍నెస్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. మనుషుల ముఖాలను గుర్తించలేని ఫేస్ బ్లైండ్‍నెస్ డిజార్డర్ ఉన్న యువకుడిగా ఈ మూవీలో సుహాస్ నటన మెప్పించింది. ప్రసన్న వదనం చిత్రం మే 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆహాలో ఈ చిత్రం దూసుకెళుతోంది. భారీగా వ్యూస్ దక్కించుకుంటోంది. ప్రసన్న వదనం చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‍గా చేశారు. వైవా హర్ష, రాశి సింగ్, నితిన్ ప్రసన్న కీరోల్స్ చేశారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024