Bhadrachalam Hotels Raids : బిర్యానీలో ఫుల్ కలర్, పాలలో ఈగలు- ఈ హోటళ్లలో తింటే అనారోగ్యాన్ని కొనుక్కున్నట్లే!
- Bhadrachalam Hotels Raids : భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. వీరి తనిఖీల్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీని గుర్తించారు. పాలలో ఈగలు, బిర్యానీలో ఫుడ్ కలర్, వాటిని ఆయిల్ నే మళ్లీ వాడుతున్నట్లు గుర్తించారు.
- Bhadrachalam Hotels Raids : భద్రాచలంలోని ప్రముఖ హోటళ్లలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. వీరి తనిఖీల్లో అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారీని గుర్తించారు. పాలలో ఈగలు, బిర్యానీలో ఫుడ్ కలర్, వాటిని ఆయిల్ నే మళ్లీ వాడుతున్నట్లు గుర్తించారు.
(1 / 7)
మీరు తరచూ బయటి హోటళ్లలో తింటున్నారా? అయితే ఆసుపత్రి ఖర్చులు రెడీ చేసుకోండి. ఇటీవల హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ప్రముఖ హోటళ్ల దారుణాలు బయటపడ్డాయి. కాలం చెల్లిన పదార్థాలతో ఆహారాలు తయారీ, నిల్వ ఉంచిన పదార్థాలు, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం, సిబ్బంది అపరిశుభ్రత, ఈగలు, ఒక్కటేంటి హోటళ్ల కిచెన్లు సర్వరోగాలకు నిలయంగా కనిపించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
(2 / 7)
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పలు హోటళ్లలలో సోమవారం ఫుడ్ సేఫ్టీ ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. భద్రాచలంలోని 𝗧𝗼𝘄𝗻𝗵𝗼𝘂𝘀𝗲 (𝗦𝗿𝗶 𝗕𝗵𝗮𝗱𝗿𝗮 𝗚𝗿𝗮𝗻𝗱) హోటల్ లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ హోటల్ లో ఫంగల్ సోకిన ఐస్‌క్రీమ్ (88 లీటర్లు) వీటి విలువ రూ. 39,600, రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన కుళ్లిన గుడ్లు గుర్తించారు. ఆహార తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడడాన్ని గుర్తించారు. బిర్యానీ (8 కిలోలు), మండీ రైస్ (10 కిలోలు), సింథటిక్ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో (0.5 కిలోలు) గుర్తించిన అధికారులు వాటిని చెత్తడబ్బాల్లో పడేశారు.
(3 / 7)
రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రతలు లేకుండా ముడి ఆహార పదార్థాలను నిల్వ ఉంచారు. హెయిర్‌క్యాప్‌లు, గ్లోవ్‌లు, అప్రాన్‌లు లేకుండా ఫుడ్ హ్యాండ్లర్లను పనిచేస్తున్నారు. ఫుడ్ హ్యాండ్లర్‌ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు తనిఖీల్లో లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. వంటకు, తాగడానికి ఉపయోగించే ఆర్వో నీటి కోసం నీటి విశ్లేషణ నివేదిక అందుబాటులో లేదని గుర్తించారు. కిచెన్ ఆవరణలో కీటకాలు లేదా ఈగలు ప్రవేశించకుండా సరైన మెష్ లేకుండా బయటి వాతావరణానికి తెరిచి ఉంచారని, డస్ట్‌బిన్‌లు మూతలు లేకుండా తెరిచి ఉన్నాయని అధికారులు తనిఖీల్లో గుర్తించారు.
(4 / 7)
భద్రాచలం 𝗦𝗿𝗶 𝗚𝗮𝘂𝘁𝗵𝗮𝗺𝗶 𝗦𝗽𝗶𝗰𝗲 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁 లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 10 కిలోల పిండిలో శిలీంధ్రాలు సోకినట్లు కనుగోని గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం, ఎలాంటి హెయిర్‌క్యాప్‌లు, గ్లౌజులు, అప్రాన్‌లు ధరించకుండా ఫుడ్ హ్యాండ్లర్లు పనిచేయడం గుర్తించారు. ఓపెన్ డ్రైనేజీ, మూతలు లేని డస్ట్‌బిన్‌లు సమీపంలో వండిన ఆహారాన్ని ఉంచినట్లు అధికారులు గుర్తించారు. వండిన, పచ్చి ఆహారం, వెజ్ , నాన్ వెజ్ ఆహారాన్ని మూతలు లేకుండా సరిగ్గా నిల్వ చేయకపోవడం, ఈగలు, ఇతర కీటకాలు ఆహార పదార్థాలపై వాలడాన్ని గుర్తించిన అధికారులు నిర్వాహకులను హెచ్చరించారు. హోటళ్ల నిర్వాహకులు నిర్లక్ష్యంపై కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు.
(5 / 7)
భద్రాచలం 𝗥𝗮𝗴𝗵𝘃𝗲𝗻𝗱𝗿𝗮 𝗛𝗼𝘁𝗲𝗹 𝗧𝗶𝗳𝗳𝗶𝗻𝘀 & 𝗠𝗲𝗮𝗹𝘀 హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. FSSAI లైసెన్స్ పత్రాలు హోటల్ లో కనిపించే విధంగా ప్రదర్శించలేదని అధికారులు గుర్తించారు. ఇడ్లీ పిండి (8 కిలోలు), ఉడకబెట్టిన పాలు (5లీటర్లు) వీటిలో ఈగలు కనిపించినట్లు గుర్తించారు. వంట చేసే ప్రాంతంలో సరైన పరిశుభ్రత పాటించడం లేదని, ఫుడ్ హ్యాండ్లర్లు సరైన హెయిర్‌నెట్‌లు, ఆప్రాన్‌లు, గ్లోవ్‌లు లేకుండా పనిచేస్తున్నారని గుర్తించారు.
(6 / 7)
వండిన, ఇతర ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటల్ యాజమాన్యం ఎలాంటి చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం లేదని, తయారుచేసిన ఆహారాన్ని పై కప్పుపై స్పైడర్ వెబ్‌లతో ఉన్న ప్రదేశాల్లో ఉంచినట్లు గుర్తించారు. నిర్లక్ష్యం వహించిన హోటళ్లపై కేసులు నమోదుచేస్తాని, వారి లైసెన్స్ లు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇతర గ్యాలరీలు