TS ICET 2024 Hall tickets : టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ల విడుదల వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?-hyderabad ts icet 2024 hall tickets released postponed to may 31 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet 2024 Hall Tickets : టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ల విడుదల వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

TS ICET 2024 Hall tickets : టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ల విడుదల వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Bandaru Satyaprasad HT Telugu
May 28, 2024 10:25 PM IST

TS ICET 2024 Hall tickets : తెలంగాణ హాల్ టికెట్లు విడుదల వాయిదా పడింది. మే 31న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.

టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ల విడుదల వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ల విడుదల వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

TS ICET 2024 Hall tickets : తెలంగాణ ఐసెట్ హాల్ టికెట్ల విడుదలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వాయిదా వేసింది. తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(TS ICET) అడ్మిట్ కార్డును మే 31, 2024న విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు icet.tsche.ac.in ఐసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే రూ .1000 ఆలస్య రుసుముతో మే 30 వరకు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 31 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మే 28న అడ్మిట్ కార్డుల విడుదల చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియను వాయిదా వేశారు.

టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా:

తెలంగాణ ఐసెట్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • Step 1 : విద్యార్థులు టీఎస్ ఐసెట్ icet.tsche.ac.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
  • Step 2 : హోమ్ పేజీలో ఉన్న టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • Step 3 : లాగిన్ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • Step 4 : మీ అడ్మిట్ కార్డు స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • Step 5 : అడ్మిట్ కార్డులో వివరాలు చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • Step 6 : తదుపరి అవసరాల కోసం దాని హాల్ టికెట్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

జూన్ 5, 2024న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ ఐసెట్ నిర్వహించనున్నారు. మొత్తంత రెండు షిఫ్టుల్లో సెషన్ 1, సెషన్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 6, 2024న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో సెషన్-3 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష, ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటాయి. ఇచ్చిన ఆప్షన్లలో అభ్యర్థి సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి.

  • సెక్షన్ ఎ - అనలిటికల్ ఎబిలిటీ-ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ & తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియంలో ఉంటుంది.
  • సెక్షన్ బి - మ్యాథమెటికల్ ఎబిలిటీ - ప్రశ్నాపత్రం ఇంగ్లిష్ & తెలుగు, ఇంగ్లిష్ & ఉర్దూ మీడియంలో ఉంటుంది.
  • సెక్షన్-సి - కమ్యూనికేషన్ ఎబిలిటీ- ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది.

ఏపీ ఐసెట్ ఫలితాలు

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30 ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన‌ విద్యార్థులకు బీటెక్, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీతో బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలన మే 30న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించనున్నారు. ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్‌సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ కమ్ ర్యాంకు కార్డును వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. విభాగాల వారీగా స్కోర్, మొత్తం మార్కులు, ర్యాంకులు విడుదల చేయనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం