TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు-hyderabad telangana icet 2024 application ends may 7th hall ticket for may 28th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 01:54 PM IST

TS ICET 2024 : తెలంగాణ ఐసెట్ -2024 దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఆలస్యం రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 28 నుంచి హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు.

 నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు
నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

TS ICET 2024 : తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. తెలంగాణ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5న విడుదల చేయగా, ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. అనంతరం దరఖాస్తు గడువును మే 7 వరకు పొడిగించారు. అయితే ఈ గడువు నేటితో ముగియనుంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఇవాళ్టి వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి పేర్కొంది. అదే విధంగా రూ.250 ఆలస్య రుసుముతో మే 17వ తేదీ వరకు వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్లలో సవరణలకు మే 17 నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఐసెట్ హాల్ టికెట్లను మే 28న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఐసెట్ పరీక్షను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐసెట్ ఫలితాలు జూన్ 28న వెబ్ సైట్ ల విడుదల చేయనున్నారు. ఈ ఏడాది తెలంగాణ ఐసెట్ ను వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

టీఎస్ ఐసెట్ 2024 దరఖాస్తు విధానం

  • టీఎస్ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ icet.tsche.ac.in ను సందర్శించండి
  • హోమ్‌పేజీలో 'Application Fee Payment' లింక్‌పై క్లిక్ చేయండి
  • అభ్యర్థుల వివరాలను నమోదు చేసి, దరఖాస్తు రుసుము చెల్లించండి
  • దరఖాస్తు ఫారమ్‌లో పూర్తి వివరాలు పూరించండి. అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  • భవిష్యత్తులో అవసరం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి

మే 28న హాల్ టికెట్లు

తెలంగాణలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024 నోటిఫికేషన్ మార్చి నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 4, 5 తేదీల్లో మూడు సెషన్లలో ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతరులకు రూ.750గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అప్లికేషన్లలో ఏమైనా సవరణలు ఉంటే వాటిని మే 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 28న కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

జూన్ 5, 6 ఐసెట్ ఎగ్జామ్

ఐసెట్–2024 ఎంట్రన్స్ పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. జూన్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షను రెండు రోజుల్లో మూడు సెషన్ లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మూడో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జూన్ 15న ఐసెట్ ప్రైమరీ కీ విడుదల చేస్తారు. ఈ ప్రాథమిక కీ పై జూన్ 16 నుంచి 19వ తేదీ మధ్య అభ్యర్థులు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. జూన్ 28న ఐసెట్-2024 తుది ఫలితాలు విడుదల చేస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం