TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, మే 7 వరకు ఛాన్స్
TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్ దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మే 7వ తేదీ వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

TS ICET 2024 Updates : తెలంగాణ ఐసెట్(TS ICET 2024) దరఖాస్తుల గడువును పొడిగించారు. తెలంగాణ ఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 5న విడుదల చేయగా, ఏప్రిల్ 30 వరకు అప్లికేషన్లు(TS ICET Applications) స్వీకరించారు. అయితే తాజాగా ఈ గడువును మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 7వ తేదీ వరకు ఐసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అదే విధంగా రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను(ICET hall Tickets) మే 28న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఐసెట్ పరీక్షను జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. ఐసెట్ ఫలితాలు(TS ICET Results 2024) జూన్ 28న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఐసెట్ ను వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) నిర్వహిస్తోంది.
మే 28న హాల్ టికెట్లు
తెలంగాణలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో ఎంబీఏ(MBA), ఎంసీఏ(MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్సిటీ టీఎస్ ఐసెట్–2024(TS ICET 2024) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు. జూన్ 4, 5 తేదీల్లో మొత్తంగా మూడు సెషన్లలో ఐసెట్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 7 వరకు ఎలాంటి ఆలస్య రుసుము(Later Fee) లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతరులకు రూ.750గా నిర్ణయించారు. అప్లికేషన్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని మే 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సరి చేసుకునే అవకాశం కల్పిస్తారు. మే 28న కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.
జూన్ 4, 5 ఐసెట్ పరీక్ష
తెలంగాణ ఐసెట్–2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ (TS ICET Exam)ను ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు రోజుల్లో మూడు సెషన్ లలో పెట్టనున్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. జూన్ 5వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు థర్డ్ సెషన్ నిర్వహించనున్నారు. కాగా జూన్ 15న ఐసెట్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. జూన్ 16వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి పరిష్కరిస్తారు. జూన్ 28న ఐసెట్ తుది ఫలితాలు వెల్లడించనున్నారు. ఒకవేళ అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాకతీయ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఐసెట్-2024 పరీక్షను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 20 ఆన్ లైన్ టెస్ట్ జోన్లను(Exam Centers) ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ 16 చోట్లా, ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్లా పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంబంధిత కథనం